వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా పసిపాప శ్వాస ఆగకుండా ఉండేందుకు సాయం చేయండి: ఓ తల్లి కన్నీటి వేదన

Google Oneindia TeluguNews

హైదరాబాద్: "మా దనశ్రీ చాలా ఉత్సాహంగా ఉండే పిల్ల. ఈరోజు తనని వందలాది ట్యూబుల మధ్య చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. తను అలసటే లేకుండా గంటలపాటు ఆడుకుంటూ ఉండేది. ఇప్పుడు పాప లేక ఇల్లంతా బోసిపోయినట్లు ఉంది. మా ఇల్లు ఏదో శ్మశానంలాగా మారిపోయింది. ఆ చిట్లి తల్లి నవ్వులతో మా ఇల్లంతా కళకళలాడిపోయేది. కానీ ఇప్పుడు తాను రోజంతా ఏడుస్తూనే కన్పిస్తోంది. మా పాప త్వరగా కోవాలి. మళ్లీ మా ఇంట్లో నవ్వులు పూయించాలి.." అంటూ
విశ్వప్రియ కన్నీళ్ల పర్యాంతమయ్యారు. చిన్నారి దనశ్రీ హాస్పిటల్లో గత 5 నెలలుగా ఉంటోంది.

విశ్వప్రియ మూడేళ్ళపాటు గర్భందాల్చటం కోసం కష్టపడ్డాక దానశ్రీకి జన్మనిచ్చారు. ఆమె తన కష్టాలను గుర్తు చేసుకుని బాధపడ్డారు. "నాకు ఇప్పుడు 34 ఏళ్ళు. పాప మా జీవితాల్లోకి వచ్చినప్పుడు దేవుడు నిజంగా మమ్మల్ని కరుణించాడనిపించింది. నేనెంతో సంతోషపడ్డాను. కానీ విధిని ఎవరూ అర్థం చేసుకోలేరు కదా. నా పాప జీవితం చాలా ప్రమాదంలో ఉంది. డాక్టర్లు మా పాప ట్రాకియల్ వాల్వ్ కొలాప్స్ స్థితితో బాధపడుతోందని చెప్పిన రోజు నాకింకా గుర్తు. డాక్టర్లు చెప్పే వ్యాధులన్నీ నాకు అర్థం అయ్యేవి కావు. కానీ నాకు ఒక్కటి మాత్రం క్లియర్ గా అర్థమైంది. నా పాపకి ఒంట్లో బాగలేదు. మా పాప పరిస్థితి చాలా విషమంగా ఉంది అని మాత్రం నాకు క్లియర్ గా అర్థమైంది.." అని విశ్వప్రియ బాధపడింది.

Even after 3 surgeries, this 1-year-old struggles for each breath

"దానశ్రీ ఎంతో హుషారుగా ఆడుకునేది. అల్లరి చేసేది. ఈ పాప 7 వ నెల వయస్సు వరకూ ఆరోగ్యంగానే ఉంది. ఒకరోజు, దానాశ్రీ వాంతులు చేసుకుంటూ శ్వాస తీసుకోడానికి కష్టపడింది. వెంటనే ఏదో తీవ్ర సమస్య అయి వుంటుందని మాకు అన్పించింది. దానాశ్రీ గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. తనని చూస్తే నా కన్నీళ్లు ఆగలేదు. కానీ మళ్లీ ధైర్యం తెచ్చున్నాను. తర్వాత నేను, మా ఆయన పాపను సేలంలోని హాస్పిటల్ కి తీసుకెళ్దాం అనుకున్నాం, అది మా ఊరు తిరుపూర్ నుంచి రెండు గంటల దూరంలో ఉంది." అని పాప గురించి గుర్తు చేసుకుంది దనశ్రీ తల్లి.

Even after 3 surgeries, this 1-year-old struggles for each breath

"పాపను నా హృదయానికి హత్తుకుని కూర్చున్నాను. కానీ ప్రయాణం మొత్తంలో తను వాంతులు చేసుకుంటూనే ఉంది. హాస్పిటల్ కి చేరిన నిమిషాన... నా పాపని కాపాడండని డాక్టర్లను వేడుకుంటూ ఏడ్చేసాను." అంటూ భావోద్వేగంతో అన్నారు విశ్వప్రియ.

అప్పటికే భయంతో ఉన్న విశ్వప్రియకి డాక్టర్లు ఆ ఏడు నెలల పాప అనుభవించాల్సిన వివిధ సంక్లిష్టమైన చికిత్సల గురించి చెప్పారు. అవి ఏవి తనకి అవేం అర్థం కాలేదు. ఆమె ఆలోచించిందల్లా తన పాప చిన్నారి శరీరం అంత నొప్పి ఎలా భరిస్తుందని మాత్రమే. విశ్వప్రియ వివరిస్తూ, "పాపని మొదటి 2 నెలలు ఐసియూలోనే ఉంచారు. అపాయం నుంచి బయటపడిందని నిర్ణయించే ముందు అలాంటి 2 సర్జరీలు చేసారు. నా పాపకి మొత్తం 3 సర్జరీలు అయ్యాయి కానీ తన స్థితి ఇంకా నాజూగ్గానే ఉంది." అన్నారు.

Even after 3 surgeries, this 1-year-old struggles for each breath

పాపాయి చికిత్సకి 15-20 లక్షలు ఖర్చుపెట్టిన తర్వాత ఆ కుటుంబం ప్రస్తుతం తిండిలేని పరిస్థితిలో ఉంది. విశ్వప్రియమాట్లాడుతూ, "మేము ఆ డబ్బునంతా మా స్నేహితులు,బంధువుల నుంచి అప్పుగా తీసుకున్నాం. వారిని ఇంతపెద్ద మొత్తాలు అడగటం చాలా కష్టమైంది. కానీ మాకు ఇంకో దారి లేదు.. కదా? దానాశ్రీ పుట్టేముందు నాకొక ప్రయివేటు ఉద్యోగం ఉండేది. తనని చూసుకోవటం కోసం, ముఖ్యంగా పాప ఆరోగ్యం దెబ్బతిన్నాక చూసుకోవటం కోసం మానేయాల్సి వచ్చింది. నా భర్త ఒక టైలర్, జీతం కేవలం నెలకి 3000 మాత్రమే వస్తుంది. ప్రస్తుతం మేము కేవలం రోజుకి ఒకసారి భోజనంతో సరిపెట్టుకుంటున్నాం." అని చెప్పారు.

Even after 3 surgeries, this 1-year-old struggles for each breath

"దానాశ్రీ ప్రస్తుతం ఆగకుండా ఆక్సిజన్ సపోర్ట్ లోనే ఉంది, అయినా తీవ్ర శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటోంది. "డాక్టర్లు ఇంకో రెండు నెలలు హాస్పిటల్లోనే ఉంచాలన్నారు. దానికోసం, తన చికిత్స మొత్తానికి మాకు మరో 5 లక్షలు అవసరం," అని విశ్వప్రియ వివరించారు.

Even after 3 surgeries, this 1-year-old struggles for each breath

ఈ కుటుంబం 5 లక్షల రూపాయల గోల్ మొత్తంతో ఫండ్ రైజర్ మొదలుపెట్టారు. మీ తరఫు నుంచి మీకు తోచినంత సాయం చేయండి. విశ్వప్రియ గారాలపట్టి దనాశ్రీని కాపాడడానికి మీకు చేతనైనంత సాయం చెయ్యండి.
Even after 3 surgeries, this 1-year-old struggles for each breath

ఆ ఇంటిలో తిరిగి వెలుగులు తీసుకురావడానికి మీ వంతు సాయపడండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X