గోమాంసం తినే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది: కేంద్రమంత్రి
గో రక్షకుల పేరుతో హత్యలకు పాల్పడుతున్న వారిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రామ్‌దాస్ అథవాలే మండిపడ్డారు.
ఢిల్లీ: గో రక్షకుల పేరుతో హత్యలకు పాల్పడుతున్న వారిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రామ్‌దాస్ అథవాలే మండిపడ్డారు.
ప్రతి ఒక్కరికీ గోమాంసం తినే హక్కు ఉందని చెప్పారు. గోరక్షణ పేరుతో మానవ భక్షణ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు గోరక్షకులకు లేదన్నారు.

వారికి ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు చెప్పాలి గానీ, ఇలా హత్యలు చేయవద్దని సూచించారు. మాంసం కోసం గోవుల క్రయవిక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది కార్యకర్తలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications