హర్యానాలో దారుణం: గంటలో ఆరుగురిని చంపిన మాజీ ఆర్మీ ఉద్యోగి

Recommended Video

    గంటలో ఆరుగురి హత్య : వీడియో

    ఛంఢీఘడ్: హర్యానా రాష్ట్రంలో ఓ సైకో ఆరుగురిని హత్య చేశాడు. పలువురిని గాయపర్చాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో మంగళవారం నాడు ఉదయం చోటు చేసుకొంది. ఈ ప్రాంతంలో పోలీసులు హై అలెర్ట్ విధించారు.

    హార్యానా రాష్ట్రంలోని పల్వాల్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి చేతిలో రాడ్ పట్టుకొని దొరికిన వారిని దొరికినట్టు చితక్కొట్టాడు. ఆ యువకుడి దాడిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పలువురు ఈ దాడిలో గాయపడ్డారు. నిందితుడిని నరేష్ దంకుడుగా గుర్తించారు.

    అయితే నరేష్ గతంలో ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారని పోలీసులు చెబుతున్నారు. సోమవారం తెల్లవారుజామున రాత్రి రెండున్నర గంటల నుండి మూడున్నర గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.

    Ex-Army Officer Allegedly Kills 6 With Rod In Haryana, Attacks Cops

    నిందితుడి దాడిలో ఓ మహిళతో పాటు మరో ఐదుగురిని హత్య చేశాడు. మొత్తం ఆరుగురు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. గంట వ్యవధిలో ఆరుగురిని నిందితుడు హత మార్చాడు. మృతదేహలు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో పడి ఉన్నాయి.

    నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్ళిన పోలీసులపై కూడ నిందితుడు దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ దాడిలో పోలీసులు కూడ గాయపడ్డారు.మతిస్థిమితం కోల్పోయి నిందితుడు ఈ రకంగా వ్యవహరించాడా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+