వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లీం అమ్మాయిలు, హిందూ అబ్బాయిల పెళ్లి, బీజేపీ మాజీ మేయర్ శకుంతుల కింగ్ పిన్ ? మతమార్పిడి, ఫైర్!

|
Google Oneindia TeluguNews

లక్నో/ ఆలీగఢ్/ న్యూఢిల్లీ: మాయం అవుతున్న ముస్లీం అమ్మాయిలు ఏం చేస్తున్నారు ? అంటే మాకేం తెలుసు అంటున్న కొందరు నేతలు ఇప్పుడు షాక్ కు గురౌతున్నారు. మాయం అయిన ముస్లీం అమ్మాయిలకు మాయమాటలు చెప్పి హిందూ అబ్బాయిలతో వివాహాలు జరిపించి ఆ అమ్మాయిలకు మతమార్పిడి చేసి వారితో కాపురాలు చేయిస్తున్నారని ఆరోపణలు బగ్గుమన్నాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ సీనియర్ లీడర్, ఆలీగఢ్ మాజీ మేయర్ శకుంతల భారతీ ముస్లీం అమ్మాయిని మతమార్పిడి చేసి హిందూ అబ్బాయితో వివాహం జరిపించారని ఇంటి నుంచి పారిపోయిన ఓ ముస్లీం యువతి సోదరి మీడియా ముందు ఆరోపణలు చెయ్యడంతో కలకలం రేపింది.

Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !

 మాజీ మేయర్ ఏం చేశారంటే !

మాజీ మేయర్ ఏం చేశారంటే !

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆలీగఢ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశంలోని ప్రముఖ యూనివర్శిటీల్లో ఆలీగఢ్ యూనివర్శిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. బీజేపీ సీనియర్ నాయకులు శకుంతల భారతీ గతంలో ఆలీగఢ్ మేయర్ గా పని చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వివాదాస్పద నాయకుల జాబితాలో శకుంతల భారతీ కూడా ఉన్నారు. బీజేపీలో శకుంతల భారతీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.

అందమైన ముస్లీం అమ్మాయిలకు వల ?

అందమైన ముస్లీం అమ్మాయిలకు వల ?

అందమైన ముస్లీం అమ్మాయిలను గుర్తించడం, వారికి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని మతమార్పిడులు చేసి హిందూ యువకులతో వివాహాలు జరిపిస్తున్నారని ఆలీగఢ్ మాజీ మేయర్ శకుంతల భారతీపై ఓ ముస్లీం యువతి మీడియా ముందు సంచలన ఆరోపణలు చెయ్యడంతో దేశవ్యాప్తంగా కలకం రేపింది.

అమ్మాయి మాయం అయితే !

అమ్మాయి మాయం అయితే !

ఆగస్టు 7వ తేదీన ఓ ముస్లీం అమ్మాయి ఇంటి నుంచి పారిపోయింది. తమ అమ్మాయి (ముస్లీం) ఇంటిలో ఉన్న బంగారు నగలు, నగదు తీసుకుని హిందూ అబ్బాయితో కలిసి వెళ్లిపోయింది, ఆమెకు బలవంతంగా మతమార్పిడి చేసి పెళ్లి చేశారని ముస్లీం యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇదే సమయంలో హిందూ అబ్బాయి మీద ఐపీసీ సెక్షన్ 365, 366 కిం కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు.

 ముస్లీం యువతి సోదరి ఫైర్

ముస్లీం యువతి సోదరి ఫైర్

తమ సోదరిని ఆలీగఢ్ మాజీ మేయర్ శకుంతల భారతీ బలవంతంగా తీసుకెళ్లి మతమార్పిడి చేసి హిందూ అబ్బాయితో పెళ్లి జరిపించారని ఇంటి నుంచి మాయం అయిన యువతి సోదరి ట్విట్టర్ లో సంచలన ఆరోపణలు చేశారు. మీరు మా సోదరిని గుర్తించి మాకు అప్పగించకపోతే మీడియాను పిలుస్తానని, మీ అంతు చూస్తానని ముస్లీం సోదరి పోలీసులను హెచ్చరించింది. ఇదే సమయంలో పోలీసులు పారిపోయిన ముస్లీం అమ్మాయి ఆచూకి గుర్తించారు.

అంతా నాఇష్టం

అంతా నాఇష్టం

ఇంటి నుంచి పారిపోయిన అమ్మాయి నా ఇష్టప్రకారం మతం మార్చుకుని హిందూ అబ్బాయితో పెళ్లి చేసుకున్నానని, తనను మతం మారాలని ఎవ్వరూ బలవంతం చెయ్యలేదని, మాజీ మేయర్ శకుంతల భారతీకి ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదని హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ముస్లీం యువతి పోలీసుల ముందు అంగీకరించింది. ముస్లీం అమ్మాయి ఇష్టప్రకారం హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అయితే మాయం అయిన ముస్లీం యువతి మాజీ మేయర్ శకుంతల భారతీ కారులోనే పోలీస్ స్టేషన్ కు రావడం కలకలం రేపింది.

మాజీ మేయర్ ఫైర్..... ఫైర్..... !

మాజీ మేయర్ ఫైర్..... ఫైర్..... !


తన మీద రాజకీయ కక్ష సాధించడానికి ముస్లీం అమ్మాయిలకు బలవంతంగా మతమార్పిడి చేస్తున్నానని ఆరోపిస్తున్నారని, అలా చేస్తే తనకు ఏమి వస్తుందో ఆరోపణలు చేస్తున్న వారే బహిరంగంగా చెప్పాలని ఆలీగఢ్ మాజీ మేయర్ శుకుంతల భారతీ మండిపడుతున్నారు. తాను ఈ విషయాన్ని సీనియస్ గా తీసుకుంటున్నానని, తన మీద ఎవరు ఆరోపణలు చేస్తున్నవారు ఎవరో గుర్తించి వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారని మాజీ మేయర్ శకుంతల భారతీ హెచ్చరించారు. మొత్తం మీద ముస్లీం అమ్మాయిలకు బలవంతంగా మతం మార్చి హిందూ అబ్బాయిలతో వివాహాలు జరిపిస్తున్నారని ఆరోపణలు ఎందుర్కొంటున్న శకుంతల భారతీ తాను ఏతప్పు చెయ్యలేదని, ఏ విచారణకైనా తాను సిద్దంగా ఉన్నానని ధీమాగా చెబుతున్నారు.

English summary
LOVE marriage?: A Muslim girl, whose sister married a Hindu boy in Aligarh after going missing, has levelled serious allegations against former BJP mayor Shakuntala Bharti. The girl held a press conference on Sunday in which she accused Shakuntala Bharti of converting Muslim girls by luring them and marrying them off to Hindu boys.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X