పెళ్లికొడుక్కి చుక్కలు చూపించిన మాజీ గర్ల్ ఫ్రెండ్, మోజు తీరిందని హ్యాండ్ ?
ఛత్తీస్ గఢ్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. చాలా సంవత్సరాల పాటు శారీరక సంబంధం పెట్టుకున్న ప్రేమికులు ఇంతకాలం ఎంజాయ్ చేశారు. ప్రియురాలి మీద మోజు తీరిపోవడంతో ఆమెను దూరం పెట్టిన ప్రియుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్దం అయ్యాడు. పెళ్లి రోజు పెళ్లి కొడుకు మీద ప్రియురాలు యాసిడ్ దాడి చెయ్యడం కలకలం రేపింది.
తనను వాడుకుని మోసం చేసిన ప్రియుడు మరో అమ్మాయితో ఎంజాయ్ చెయ్యకూడదని యాసిడ్ దాడి చేసిన యువతి చివరికి పోలీసులకు చిక్కిపోయింది. మగాడిలా ప్యాంట్, షర్టు వేసుకుని వెళ్లి మాజీ ప్రియుడి మీద యాసిడ్ దాడి చేసిన యువతిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బస్తార్ జిల్లా ఎస్పీ నివేదితా పాల్ మీడియాకు చెప్పారు.

ఛత్తీస్ గఢ్ లోని బస్తార్ జిల్లాలోని భాన్ పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో దమ్రుధర్ బఫేల్ అలియాస్ బఫేల్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బఫేల్ నివాసం ఉంటున్న గ్రామంలోనే నివాసం ఉంటున్న 22 ఏళ్ల యువతిని అతను ప్రేమించాడు. యువతి కూడా బఫేల్ ను ప్రేమించింది.
గత నాలుగు ఏళ్ల నుంచి బఫేల్ అతని ప్రియురాలితో తిరుగుతూ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రియుడు పెళ్లి చేసుకుంటాడని నమ్మిన ప్రియురాలు బఫేల్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి అతని కోరికలు తీరుస్తూ వచ్చింది. ప్రియురాలి మీద మోజు తీరిపోయిన బఫేల్ కుటుంబ సభ్యులు చూపించిన 19 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు.
పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు బఫేల్ మీద ఒత్తిడి చేసింది. అయితే బఫేల్ మాత్రం అతని ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. తనను మోసం చేసిన మాజీ ప్రియుడు బఫేల్ కు తగినబుద్ది చెప్పాలని అతని ప్రియురాలు డిసైడ్ అయ్యింది.

పెళ్లి రోజు బంధువులు అందరూ పెళ్లికొడుకు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో మగాడిలా ప్యాంట్, షర్టు వేసుకున్న ప్రియురాలు యాసిడ్ బాటిల్ ఎత్తుకు వెళ్లి పెళ్లికొడుకు మీద పోసింది. ఈ యాసిడ్ దాడిలో పెళ్లికొడుకుతో పాటు పెళ్లికి హాజరైన 10 మంది మీద యాసిడ్ పడటంతో అందరికి గాయాలు కావడంతో అందర్నీ ఆసుపత్రికి తరలించారు.
యాసిడ్ దాడి జరిగిన సమయంలో కరెంట్ పోవడంతో ఎవరు యాసిడ్ దాడి చేశారు ? అనే విషయంలో అందరూ అయోమయంలో పడిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెళ్లికొడుకు బఫెల్ అతని మాజీ ప్రియురాలి మీద అనుమానం వ్యక్తం చేశాడు. యాసిడ్ దాడి చేసి తప్పించుకుని పారిపోయిన అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బస్తార్ జిల్లా ఎస్పీ నివేదితా పాల్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications