EX wife: అటకెక్కిన కాపురం, మాజీ భార్యతో ఫ్రెండ్ ?, స్నేహితుడి గొంతు కోసి చంపేసిన భర్త !
రాయ్ పూర్: కుటుంబ సభ్యులు చూపించిన యువతిని ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని సంవత్సరం కాకుండానే దంపతుల మద్య తేడాలు వచ్చాయి. పెద్దలు పంచాయితీలు చేసినా దంపతుల కాపురం అటకెక్కింది. ఇక లాభం లేదని అనుకున్న దంపతులు విడిపోయారు. భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యకు దూరంగా ఉంటున్న భర్త మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇదే సమయంలో నిత్యం తనతో తిరుగుతున్న తన స్నేహితుడు తన మాజీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మాజీ భర్తకు అనుమానం పెరిగిపోయింది. నీ పద్దతి మార్చుకోవాలని స్నేహితుడిని మాజీ భర్త హెచ్చరించాడు. అయితే నువ్వు వదిలేసిన నీ మాజీ భార్యతో నేను మాట్లాడితే నీకెందుకు, ఆమెతో తిరిగితే నీకెందుకు అంటూ స్నేహితుడు ఎదురు తిరిగాడు. అంతే మాజీ భర్తకు ఎక్కడో కాలిపోయి స్నేహితుడి గొంతు కోసి దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

ఏడాదికే భార్యతో ఢిష్యూం ఢిష్యూం
చత్తీస్ గఢ్ లోని మంగేలి జిల్లాలో దూలేశ్వర్ పాత్రే అలియాస్ దూలేశ్వర్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన యువతిని దూలేశ్వర్ పాత్రే వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని సంవత్సరం కాకుండానే దూలేశ్వర్ పాత్రే దంపతుల మద్య తేడాలు వచ్చాయి.

విడిపోయిన దంపతులు
పెద్దలు పంచాయితీలు చేసినా దూలేశ్వర్ దంపతుల కాపురం అటకెక్కింది. ఇక లాభం లేదని అనుకున్న దూలేశ్వర్ దంపతులు విడిపోయారు. భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యకు దూరంగా ఉంటున్న దూలేశ్వర్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న దూలేశ్వర్ మాత్రం అతని మొదటి భార్యను మరిచిపోలేకపోయాడు.

ఫ్రెండ్ మాజీ భార్యతో టచ్ లో ఉన్న స్నేహితుడు
దూలేశ్వర్ కు పంజాబ్ లో మనోజ్ కుమార్ అలియాస్ మనోజ్ (39) అనే స్నేహితుడు ఉన్నాడు. దూలేశ్వర్, మనోజ్ కుమార్ కు వయసులో చాలా తేడా ఉన్నా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, దూలేశ్వర్ మాజీ భార్యతో ముందు నుంచి మనోజ్ కుమార్ కు పరిచయం ఉంది. దూలేశ్వర్ అతని భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత కూడా మనోజ్ కుమార్ ఆమెతో టచ్ లో ఉన్నాడు.

మాజీ భార్యకు అక్రమ సంబంధం ఉందని డౌట్
నిత్యం తనతో తిరుగుతున్న తన స్నేహితుడు మనోజ్ కుమార్ తన మాజీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మాజీ భర్త దూలేశ్వర్ కు అనుమానం పెరిగిపోయింది. నీ పద్దతి మార్చుకోవాలని స్నేహితుడు మనోజ్ కుమార్ ను మాజీ భర్త దూలేశ్వర్ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించాడు.

ఫ్రెండ్ ను పక్కాప్లాన్ తో చంపేసిన మాజీ భర్త
నువ్వు వదిలేసిన నీ మాజీ భార్యతో నేను మాట్లాడితే నీకెందుకు, ఆమెతో తిరిగితే నీకెందుకు అంటూ స్నేహితుడు మనోజ్ కుమార్ అతని ఫ్రెండ్ దూలేశ్వర్ కు ఎదురు తిరిగాడు. అంతే మాజీ భర్త దూలేశ్వర్ కు ఎక్కడో కాలిపోయింది. జనవరి 14వ తేదీనర రాయ్ పూర్ సమీపంలోని మొహదా గ్రామంలోకి మనోజ్ కుమార్ ను నమ్మించి పిలుచుకుని వెళ్లిన దూలేశ్వర్ అతని గొంతు కోసి దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

డ్రామాలు ఆడిన మాజీ భర్త
మొదట తాను మనోజ్ కుమార్ ను హత్య చెయ్యలేదని దూలేశ్వర్ బుకాయించాడని, బెండ్ తీస్తే అతనే హత్య చేశాడని అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద మాజీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని దూలేశ్వర్ అతని స్నేహితుడు మనోజ్ కుమార్ ను హత్య చెయ్యడం చత్తీస్ గఢ్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications