బీజేపీకి షాక్, మాయావతితో సిద్ధం: అఖిలేష్ షాకింగ్ ప్రకటన
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో.. ఉత్తర ప్రదేశ్‌లో అనూహ్యం జరగనుందా? బద్ద శత్రువులైన ఎస్పీ-బీఎస్పీలు కలుస్తాయా? బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయా? అంటే కాదని చెప్పలేమని అంటున్నారు.
అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు కూడా ఆ దిశగానే కనిపిస్తున్నాయి. యూపీలో ఎస్పీ - కాంగ్రెస్‌లు ఆశించిన ఫలితాలు రావడం లేదని ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా వెల్లడవుతోంది.

ఈ నేపథ్యంలో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. బీఎస్పీతో జత కట్టేందుకు సిద్ధమని అఖిలేష్ ప్రకటించారు. ఆయన బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎస్పీ - కాంగ్రెస్‌లకు తక్కువ సీట్లు వస్తే బీఎస్పీతో కలిసేందుకు సిద్ధమని చెప్పారు. అదే జరిగితే బీజేపీకి షాక్ అని చెప్పవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎస్పీ - కాంగ్రెస్, బీఎస్పీలు కలిస్తే అధికారం చేపట్టవచ్చు.












Click it and Unblock the Notifications