ఎగ్జిట్ పోల్: హిమాచల్‌లో బిజెపికే పట్టం కట్టిన చాణక్య సర్వే
సిమ్లా: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుజరాత్ ఫలితాల తర్వాత హిమాచల్‌లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
Recommended Video

ఇక్కడ 68 స్థానాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. కాగా, హిమాచల్ ప్రదేశ్ బీజేపీతో అని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉంది.

చాణక్య అంచనా ప్రకారం భారీ విజయాన్ని అంచనా వేసింది. 68 సీట్లు గల శాసనసభలో బిజెపి 55 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెసుకు 13 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపింది. హిమాలచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా విదర్భ సింగ్‌ను ప్రకటించగా, బిజెపి ప్రేమ్ కుమార్ దమాల్‌ను ముందుకు తెచ్చింది.
ఎగ్జిట్ పోల్స్ నిజమైతే 'టార్గెట్ 50'తో రంగంలోకి దిగిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా... అనుకున్నట్టుగానే విజయబావుటా ఎగురవేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
చాణక్య సర్వే ప్రకారం - బిజెపికి 51 శాతం మంది ఓటు వేయగా, కాంగ్రెసుకు 38 శాతం మంది ఓటేశారు. ఇతరులకు 11 శాతం ఓట్లు పడ్డాయి.












Click it and Unblock the Notifications