సాయంత్రం 6:30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ : ఈసీ

Recommended Video

    AP Assembly Election 2019 : సాయంత్రం 6:30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ ! -ఈసీ || Oneindia Telugu

    న్యూఢిల్లీ: ఇప్పటి వరకు సాయంత్రం ఆరుగంటలకే ఎగ్జిట్ పోల్స్ ఇస్తామంటూ తెగహడావుడి చేసేసిన మీడియాకు ఎన్నికల సంఘం మరో అరగంట పొడిగిస్తూ సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించొచ్చని స్పష్టం చేసింది. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 19వరకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిరవహించరాదని 1951 ప్రజాప్రతినిధుల చట్టం కల్పించిన హక్కు ద్వారా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.

    లోక్‌సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాలకు జరిగిన నేపథ్యంలో ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఎలాంటి మాధ్యమాల ద్వారా కానీ ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టరాదని ఒకవేళ బయటపెడితే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు దశల వారీగా జరిగిన ఎన్నికల్లో ఎన్నికలు ముగిసిన 48 గంటల పాటు ఒపీనియన్ పోల్ కానీ, ఎగ్జిట్ పోల్స్ కానీ ఇతరత్ర సర్వేలపై కానీ చర్చించడాన్ని కూడా సీరియస్‌గా పరిగణించింది ఎన్నికల సంఘం.

    Exit polls can be declared only after 6:30 pm onwards:EC

    ఇక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. మే 19న సాయంత్రం ఆరుగంటల సమయానికి పోలింగ్ ముగుస్తుంది. మొత్తం ఏడు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల్లోపు క్యూలైన్లో నిల్చున్న ప్రతిఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల సంఘం. ఓటే వేసేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని భావించిన ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్ ఫలితాలను మరో అరగంట వాయిదా వేసి 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువరించొచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+