ఎగ్జిట్ పోల్ లైవ్: హిమాచల్‌లో కాంగ్రెసుకు చావుదెబ్బ, బిజెపి గాలి
Recommended Video

సిమ్లా: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుజరాత్ ఫలితాల తర్వాత హిమాచల్‌లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇక్కడ 68 స్థానాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. కాగా, హిమాచల్ ప్రదేశ్ బీజేపీతో అని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉంది.ఆక్సిస్ మై ఇండియా ప్రకారం
బిజెపి: 47 నుంచి 55
కాంగ్రెసు: 13 నుంచి 20
ఇతరులు: 0 నుంచి 2
ఎబిపి న్యూస్ - సిఎస్‌డిఎస్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి స్వీప్ చేస్తుంది. భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది.
బిజెపి: 47 నుంచి 55
కాంగ్రెసు : 13 నుంచి 20
ఇతరులు: 0
ఎగ్జిట్ పోల్స్ నిజమైతే 'టార్గెట్ 50'తో రంగంలోకి దిగిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా... అనుకున్నట్టుగానే విజయబావుటా ఎగురవేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
TOI-C Voter:
TIMES NOW VMR:
Axis India Today:
ABP-CSDS:
Today's Chanakya:
Total Table:

చాణక్య ఎగ్జిట్ పోల్
చాణక్య అంచనా ప్రకారం భారీ విజయాన్ని అంచనా వేసింది. 68 సీట్లు గల శాసనసభలో బిజెపి 55 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెసుకు 13 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపింది. హిమాలచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా విదర్భ సింగ్‌ను ప్రకటించగా, బిజెపి ప్రేమ్ కుమార్ దమాల్‌ను ముందుకు తెచ్చింది.

చాణక్య సర్వే ప్రకారం
చాణక్య సర్వే ప్రకారం - బిజెపికి 51 శాతం మంది ఓటు వేయగా, కాంగ్రెసుకు 38 శాతం మంది ఓటేశారు. ఇతరులకు 11 శాతం ఓట్లు పడ్డాయి.

టైమ్స్ సర్వే ప్రకారం..
టైమ్స్ నౌ, విఎంఆర్ సర్వే కూడా బిజెపికే ఓటేసింది. ఈ సర్వే ప్రకారం బిజెపికి 51 సీట్లు వస్తాయి. కాంగ్రెసు స్థానాలు 17కు పడిపోతాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి 35 సీట్లు అవసరమవుతాయి.

సహారా సమయ్ - సిఎన్ఎక్స్ ఎగ్డిట్ పోల్
బిజెపి 42 నుంచి52 స్థానాలు గెలుచుకుంటుందని సహారా సమయ్ - సిఎన్ఎక్స్ ఎగ్డిట్ పోల్ సర్వే తెలియజేస్తోంది.కాంగ్రెసు పార్టీ 18 నుంచి 24 సీట్లకు పరిమితమవుతుంది.












Click it and Unblock the Notifications