నవీన్ పట్నాయక్ అద్భుత విజన్-మూల మూలకు వైద్య సేవలు-వర్కౌట్ అయిన 5T-దేశానికే ఆదర్శంగా ఒడిశా
కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు దేశంలోని అన్ని రాష్ట్రాలు విలవిల్లాడిపోయాయి. కర్ఫ్యూ,లాక్‌డౌన్ వంటి కట్టడి చర్యలతో ఇప్పుడిప్పుడే మహమ్మారి నుంచి కాస్త బయటపడుతున్నాయి. ఈ విషయంలో ఒడిశా రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే ఒకింత ముందు ఉందనే చెప్పాలి. ఆరంభంలోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఒడిశా ప్రభుత్వం విజయం సాధించింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలో చీఫ్ సెక్రటరీ సురేశ్ చంద్ర మోహనపాత్ర వివిధ సంస్థలను,శాఖలను సమన్వయం చేస్తూ సమర్థవంతమైన,ప్రభావంతమైన చర్యలు చేపట్టారు. నవీన్ పట్నాయక్ విజన్,స్ట్రాటజీ, ప్రభుత్వ శాఖల సమర్థ పనితీరు అన్ని కలగలసి ఒడిశా కరోనాపై అత్యంత ఎఫెక్టివ్‌గా పోరాడింది.
Recommended Video

అన్ని శాఖల సమన్వయం...ఐక్య పోరాటం...
ఒక టీమ్‌గా ముందుకు సాగుతూ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి ప్రాణాన్ని కరోనా నుంచి కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 'ఐక్య పోరాటం' అన్న సూత్రాన్ని ఆచరణలో అమలుచేసి చివరకు కరోనాపై విజయం సాధించారు. ప్రభుత్వ చర్యల కృషితో రాష్ట్రంలో అతి తక్కువ కోవిడ్ మరణాలు సంభవించాయి. రాష్ట్రంలోని ఆరోగ్య,ఐటీ,పోలీస్,అర్బన్ డెవలప్‌మెంట్,విపత్తు నిర్వహణ శాఖ,సమాచార పౌర సంబంధాలు,మిషన్ శక్తి తదితర శాఖలన్నింటిని సమన్వయం చేసి కరోనాపై పోరాడటం వల్లే ఇది సాధ్యమైందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

పట్నాయక్ 5T విజన్..
కరోనాపై పోరులో ప్రధానంగా ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ కీలక పాత్ర పోషించింది.కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి వైరస్ కట్టడిలో ప్రభావవంతమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందుచూపుతో తీసుకొచ్చిన '5T' కార్యక్రమం కరోనాను ఎదుర్కోవడంలో కీలక భూమిక పోషించింది. 2019లో నవీన్ పట్నాయక్ దీన్ని ఏర్పాటు చేశారు. 5టీ అంటే టీమ్ వర్క్,టెక్నాలజీ,ట్రాన్సపరెన్సీ(పారదర్శకత),టైమ్ లిమిట్(నిర్ణీత కాలం),ట్రాన్స్ఫర్మేషన్(పరివర్తన) అని అర్థం. వేగవంతమైన,పారదర్శకమైన,మార్పును చూపించే లక్ష్యాలతో పాలన సాగాలన్న ఉద్దేశంతో నవీన్ పట్నాయక్ ఈ విజన్‌ను రూపొందించారు. ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖలను దీనితో సమన్వయం చేశారు.

దేశంలోనే రికార్డు టైమ్‌లో తొలి కోవిడ్ ఆస్పత్రి...
కరోనా కష్టకాలంలో ఈ 5టీ విజయన్ ఒడిశాకు ఎంతగానో దోహదపడింది. అప్పటికే ఈ విజన్‌ను అలవరుచుకున్న ప్రభుత్వ శాఖలు కరోనా వ్యాప్తి మొదలవగానే వెంటనే కార్యక్షేత్రంలోకి దిగి వైరస్‌ను కట్టడి చేసే చర్యలు చేపట్టాయి. గతేడాది దేశంలో ఇంకా లాక్‌డౌన్ కూడా ప్రకటించకముందే ఒడిశా ప్రభుత్వం భువనేశ్వర్‌లో అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రిని ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించింది. రికార్డు టైమ్‌లో దేశంలో కోవిడ్ ఆస్పత్రి నిర్మించిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ప్రస్తుతం ఒడిశాలో 83 ఆస్పత్రులు పూర్తి స్థాయిలో కోవిడ్ చికిత్స అందిస్తున్నాయి.

మూల మూలకు వైద్య సేవలు
రాష్ట్రంలోని ప్రతీ మూలకు వైద్య సేవలను విస్తరించడంలో ఒడిశా ప్రభుత్వం సఫలమైంది. ఈరోజు వరకు ఒడిశాలో 120 క్రిటికల్ కేర్ యూనిట్లు,17వేలకు పైగా పడకలు జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. గతేడాది జులైలోనే ఒడిశా ప్రభుత్వం సుశిక్షితులైన 7వేల మంది హెల్త్ కేర్ సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో చివరి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థుల సేవలను కూడా ఉపయోగించుకుంది. ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు కోవిడ్ సమాచారాన్ని చేరవేయడంతో పాటు.. డేటా విశ్లేషణ ద్వారా పరిస్థితులకు తగినట్లు చర్యలకు ఉపక్రమించింది. వ్యాక్సినేషన్ విషయంలోనూ ఒడిశా ఆరోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ద పెట్టింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 77 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చింది. మొత్తంగా నవీన్ పట్నాయక్ విజన్‌తో ఒడిశా ఇవాళ దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచిందనే చెప్పాలి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications