ఫేస్‌బుక్: పాకిస్థాన్‌లో ఇక ఫ్రీ ఇంటర్నెస్ సర్వీస్
కరాచీ: తమ కంపనీ ద్వారా పాకిస్థాన్ దేశంలో ఉచిత ఇంటర్నెట్ సేవలు అందిస్తామని ఫేస్‌బుక్ సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఇందుకోసం ఆయన ఇంటర్నెట్.ఓఆర్‌జిని ప్రారంభించారు.
డాన్ న్యూస్ కథనం ప్రకారం.. ఫేస్‌బుక్ తన ఇంటర్నెట్.ఓఆర్‌జిని ప్రస్తుతం టెలీనార్ నెట్‌వర్క్‌పై సేవలందిస్తోంది. పాకిస్థాన్‌లో ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లుగా బుధవారం మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలియజేశారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వాడకాన్ని పెంచే లక్ష్యంతో ఫేస్‌బుక్.. ఇంటర్నెట్.ఓఆర్‌జిని సంస్థను ప్రారంభించింది.
కాగా, ఫేస్‌బుక్ ఇంతకుముందు ఈ సేవలను భారత్, బంగ్లాదేశ్‌లలో ప్రారంభించింది.












Click it and Unblock the Notifications