Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

facebook: ఐఏఎస్ చదివి పెళ్లి చేసుకుంటా, రూ. 40 లక్షలు నాకేసి ?, అమ్మాయి కాదు ఆంటీ !

బెంగళూరు/విజయపుర/హైదరాబాద్: బిల్డర్ దగ్గర ఓ యువకుడు సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. జీతంతో పాటు ఆ యువకుడికి చాలా లాభాలు ఉన్నాయి. ఫేస్ బుక్ లో అందమైన యువతి ఫోటో చూసి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తాను ఐఏఎస్ చదవుతున్నానని, ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్నానని ఆ యువతి అతనికి చెప్పింది. కొంతకాలం ఇద్దరూ సోషల్ మీడియాలో, ఫోన్ లో టచ్ లో ఉన్నారు. ఇలాగే యువకుడిని నమ్మించి రూ. 40 లక్షలు లాగేసింది. తీరా తాను ఫోన్ లో మాట్లాడుతున్నది, ఇంత డబ్బులు ఇచ్చింది అమ్మాయికి కాదు, ఆంటీకి అని తెలుసుకున్న యువకుడు మూర్చపోయాడు.

Singer: నాలుగు రాష్ట్రాలు, ఆరు మంది భార్యలు, ఈ సింగర్ పోటుగాడు, పైగా సిద్దాంతాలు, ఎలా చేశాడంటే ?

 హైదరాబాద్ లో ఉద్యోగం

హైదరాబాద్ లో ఉద్యోగం

కర్ణాటకలోని విజయపురలో నివాసం ఉండే పరమేశ్వర్ సిప్పగి అలియాస్ పరమేశ్వర్ అనే యువకుడు కొన్ని సంవత్సరాల క్రితమే హైదరాబాద్ చేరుకుని ప్రముఖ బిల్డర్ దగ్గర సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పరమేశ్వర్ కు రూ. 30 వేల జీతంతో పాటు అతనికి ఇతర మార్గాల ద్వారా భారీ మొత్తంలో ఆధాయం ఉందని తెలిసింది.

 ఫేస్ బుక్ ఫ్రెండ్

ఫేస్ బుక్ ఫ్రెండ్

ఫేస్ బుక్ లో అందమైన యువతి ఫోటో చూసిన పరమేశ్వర్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తాను ఐఏఎస్ చదవుతున్నానని, ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్నానని ఆ యువతి అతనికి చెప్పింది. కొంతకాలం ఇద్దరూ సోషల్ మీడియాలో, ఫోన్ లో టచ్ లో ఉన్నారు. చాలా కాలం రాత్రిపూట గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారు.

 ఐఏఎస్ పాస్ అవుతా.....నిన్ను పెళ్లిచేసుకుంటా

ఐఏఎస్ పాస్ అవుతా.....నిన్ను పెళ్లిచేసుకుంటా

తాను ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడానికి ఆర్థిక సమస్యలు ఎదురైనాయని, నువ్వు సహాయం చేస్తే నేను కలెక్టర్ అయిన తరువాత నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆమె పరమేశ్వర్ కు చెప్పింది. యువతి మాయమాటలు నమ్మిన పరమేశ్వర్ ఆమెకు సహాయం చెయ్యాలని అనుకున్నాడు. మొదట ఉద్యోగం చేస్తూ సంపాధించి దాచిపెట్టుకున్న రూ. 5 లక్షలు ఆమెకు ఇచ్చాడు.

 రూ. 40 లక్షలు నాకేసింది

రూ. 40 లక్షలు నాకేసింది

తరువాత యువతి మాయలో పడిపోయిన పరమేశ్వర్ తరువాత హైదరాబాద్ లో ఉన్న ఫ్లాట్ అమ్మేసి ఆమె ఇప్పటి వరకు రూ. 40 లక్షలు సమర్పించాడు. బంగారు బాతు గుడ్డు చిక్కిందని ఆమె పరమేశ్వర్ నుంచి ఇంకా డబ్బలు లాక్కోవాలని ప్రయత్నించింది. అయితే యువతి మీద అనుమానం రావడంతో లేటుగా నిద్రలేచిన పరమేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు

 అమ్మాయి కాదు.... ఆంటీ

అమ్మాయి కాదు.... ఆంటీ

రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని చెన్నరాయణపట్టణ తాలుకాలోని దాసరహళ్లిలో నివాసం ఉంటున్న మంజుల అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.ఇంతకాలం తాను ఫోన్ లో మాట్లాడింది, చాటింగ్ చేసింది మంజు అనే అమ్మాయితో కాదని, మంజుల ఆంటీతో అని తెలుసుకున్న పరమేశ్వర్ బిత్తరపోయాడు.

 మొగుడితో జల్సాలు

మొగుడితో జల్సాలు

హైదరాబాద్ లో ఉంటున్న పరమేశ్వర్ అనే యువకుడిని మంజుల మోసం చేస్తోందని ఆమె భర్తకు కూడా తెలుసని పోలీసులు అన్నారు. పరమేశ్వర్ నుంచి లాక్కొన్న రూ. 40 లక్షల్లో మంజల 100 గ్రాముల బంగారు నగలు, కారు తీసుకుందని, సొంత ఊరిలో కొత్తగా ఇల్లు కడుతోందని పోలీసు అధికారులు అన్నారు. మంజుల, ఆమె భర్త ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేశారు ? అని ఆరా తీస్తున్నామని విజయపుర పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+