వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ కరీం తెల్గీ: ఏపీతో లింకు ఇదీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ స్టాంపుల కుంభకోణంలో నిందితుడు కరీం తెల్గీ అనారోగ్యంతో మరణించాడు. 2001లో తెల్గీ వివాదం బయటకు వచ్చింది. అసలు ఎవరీ తెల్గీ అసలు నకిలీ స్టాంపుల కుంభకోణం ఎలా జరిగిందనేద

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ స్టాంపుల కుంభకోణంలో నిందితుడు కరీం తెల్గీ అనారోగ్యంతో మరణించాడు. 2001లో తెల్గీ వివాదం బయటకు వచ్చింది. అసలు ఎవరీ తెల్గీ అసలు నకిలీ స్టాంపుల కుంభకోణం ఎలా జరిగిందనేది ఆ సమయంలో దేశంలోనే సంచలనానికి కారణమైంది.అయితే నకిలీ స్టాంపుల కుంభకోణం కేసుతో అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి కూడ లింకులున్నాయి.

నకిలీ స్టాంపుల కుంభకోణం వెలుగులోకి వచ్చిన సమయంలో ఒక సంచలనం. దేశ వ్యాప్తంగా ఈ కేసుపై పెద్ద ఎత్తున విచారణ సాగింది. ఈ విచారణలో పలువురు అధికారుల పాత్ర ఉందని తేలింది. కొందరు రాజకీయ నేతల పాత్రలు కూడ ఉన్నాయని కూడ తేలింది.

నకిలీ స్టాంపుల కుంభకోణంలో పాత్రధారి కరీం తెల్గీ మృతి నకిలీ స్టాంపుల కుంభకోణంలో పాత్రధారి కరీం తెల్గీ మృతి

ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత స్టాంపు పేపర్ల ముద్రణలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంది. సులభంగా డబ్బులు సంపాదించేందుకు గాను కరీం తెల్గీ నకిలీ స్టాంపుల తయారీని మార్గంగా ఎంచుకొన్నారు.

దొంగనోట్ల నుండి నకిలీ స్టాంపుల తయారీ వరకు

దొంగనోట్ల నుండి నకిలీ స్టాంపుల తయారీ వరకు

ప్రారంభంలో దొంగ నోట్లు, నకిలీ పాస్‌పోర్టులను తయారు చేసి సొమ్ము చేసుకున్నట్లు తెల్గీపై ఆరోపణలు ఉన్నాయి. నకిలీ స్టాంపు కాగితాలను ముద్రిస్తే రూ.కోట్లు సంపాదించవచ్చని భావించిన తెల్గీ చిన్న స్థాయిలో వాటిని ముద్రించటం ప్రారంభించి దందా విస్తరించాడు. సుమారు 350మందికి ఉద్యోగం పేరిట స్టాంపు కాగితాలను విక్రయించే బాధ్యతల్ని అప్పగించాడు. తెల్గీ రూ.33 వేల కోట్ల విలువైన నకిలీ స్టాంపు కాగితాలను ముద్రించి విక్రయించాడన్నది ప్రధాన అభియోగం. ఆరోపణలు రుజువు కావడంతో అత‌డిపై నమోదైన కేసులన్నింటికీ కలిపి 43 సంవత్సరాల జైలుశిక్ష విధించారు.

తొమ్మిది రాష్ట్రాల్లో నకిలీ స్టాంపుల విక్రయాలు

తొమ్మిది రాష్ట్రాల్లో నకిలీ స్టాంపుల విక్రయాలు

బెంగళూరు కేంద్రంగా తొమ్మిది రాష్ట్రాల్లోని 72 కేంద్రాల నుంచి నకిలీ స్టాంపులు విక్రయించారని విచారణలో రుజువైంది. పోలీసు అధికారులు, కొందరు రాజకీయ నాయకుల అండతో తన అక్రమాలను కొనసాగించాడనేది తెల్గీపై ప్రధాన అభియోగం. అప్పటి ముంబయి పోలీసు జాయింట్‌ కమిషనర్‌ శ్రీధర్‌ వగాల్‌ రూ.72లక్షలను తెల్గీ నుంచి తీసుకున్నాడని విచారణలో తేలింది. కర్ణాటకలోని కొందరు పోలీసు అధికారులు, నాయకులు ఈ కేసు విచారణను ఎదుర్కొన్నారు.తెల్గీ ఏ మేరకు అధికారులను, రాజకీయ నేతలను ప్రభావితం చేశారో అర్ధం చేసుకోవచ్చు.

ఉద్యోగాల పేరిట నకిలీ స్టాంపుల విక్రయాలు

ఉద్యోగాల పేరిట నకిలీ స్టాంపుల విక్రయాలు

సుమారు 350మందికి ఉద్యోగం పేరిట స్టాంపు కాగితాలను విక్రయించే బాధ్యతల్ని తెల్గీ అప్పగించాడు. బ్యాంకులు, స్థిరాస్తి వ్యాపారులు, బీమా సంస్థలు తదితరులకు భారీగా వాటిని విక్రయించాడు. 2001లో పోలీసులకు దొరికిపోయాడు. జనవరి 17, 2006లో తెల్గీ, అతని ప్రధాన అనుచరులకు శిక్ష విధిస్తూ బెంగళూరు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఏపీతో నకిలీ స్టాంపుల కేసుతో లింకులు

ఏపీతో నకిలీ స్టాంపుల కేసుతో లింకులు

నకిలీ స్టాంపుల కేసులో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి కూడ సంబంధాలున్నాయి. నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన మంత్రి కృష్ణయాదవ్‌పై ఆరోపణలు వచ్చాయి.ఈ ఆరోపణల నేపథ్యంలో కృష్ణయాదవ్‌ను అప్పటి సీఎం చంద్రబాబునాయుడు కృష్ణయాదవ్‌ను మంత్రివర్గం నుండి తప్పించారు. అయితే ఈ ఆరోపణలను కృష్ణయాదవ్ ఖండించారు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని కృష్ణయాదవ్ అప్పట్లోనే ప్రకటించారు.

English summary
Abdul Karim Lala Telgi, kingpin of the multi-crore fake stamp paper scam died on Thursday at a Bengaluru hospital .Telgi, who was serving a 30-year prison sentence after being convicted in the stamp paper scam, was suffering from meningitis and was admitted to Victoria Hospital last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X