
Family: రాత్రి ఇంటికి వెళ్లి ఏం చేశాడంటే ?, అత్తమామలను గొడ్డలితో నరికేశాడు, కూతురు, భార్య బచావ్!
నాగ్ పూర్/ముంబాయి: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్య పుట్టింటిలోనే ఇల్లరికం ఉండిపోయాడు. పెళ్లి చేసుకున్న తరువాత దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఓ కూతురు పుట్టింది. సంపాధించిన డబ్బు అల్లుడు అతని అత్తమామలు, భార్య దగ్గరకు ఇచ్చేవాడు. రాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య పుట్టింటిలోనే భర్త కూడా ఉండటంతో అతనికి అత్తమామలు బుద్దిమాటలు చెబుతూ కూతురికి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు.
ఇటీవల ఆస్తుల పంపకాల విషయంలో అతను రచ్చరచ్చ చేశాడు. మద్యం సేవించి వెళ్లి భార్యను పట్టుకుని చితకబాదేస్తున్నాడు. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవపెట్టుకున్నాడు. సహనం కోల్పోయి గొడ్డలి తీసుకుని భార్య మీద దాడి చేశాడు. అడ్డుపడిన అత్తమామలు, కూతురి మీద అదే గొడ్డలితో నరికేశాడు. మద్యం మత్తులో గొడ్డలితో ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
Lovers: నీతో ఎంజాయ్ చేశాను, నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పిన ప్రియురాలు, ప్రియుడు ఏం చేశాడంటే!

ఇల్లరికం అల్లుడు
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోని అమర్ నగర్ లో భగవాన్ రావర్ (75), పుప్పా రావర్ (65) దంపతులు నివాసం ఉంటున్నారు. భగవాన్, పుష్పా దంపతులకు కల్పనా (40) అనే కుమార్తె ఉంది. 2003లో నర్ము సీతా యాదవ్ అలియాస్ నర్ము యాదవ్ (42) అనే వ్యక్తితో కల్పనా వివాహం జరిగింది. కల్పనాను పెళ్లి చేసుకున్న తరువాత నర్ము యాదవ్ భార్య ఇంటిలో ఇల్లరికం ఉండిపోయాడు.

అత్తమామలు, భార్యకు డబ్బులు ఇచ్చేశాడు
పెళ్లి చేసుకున్న తరువాత నర్ము యాదవ్, కల్పనా దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ముస్కాన్ అనే కూతురు పుట్టింది. ముస్కాన్ కు ప్రస్తుతం 15 సంవత్సరాల వయసు. డ్రైవర్ పని చేస్తున్న నర్ము యాదవ్ అతను సంపాధించిన డబ్బు అతని అత్తమామలు, భార్య కల్పనా దగ్గరకు ఇచ్చేవాడు.

చిన్నగా మొదలైన గొడవలు
రానురాను నర్ము యాదవ్, కల్పనా దంపతుల మద్య చిన్నచిన్నగా గొడవలు మొదలైనాయి. కల్పనా తండ్రి భగవాన్ 50 మేకలు, ఆవులు పెట్టుకుని పాల వ్యాపారం చేస్తున్నాడు. తనకు డబ్బులు కావాలని నర్ము యాదవ్ అతని అత్తమామలను అడిగాడు. డబ్బులు ఇవ్వడానికి అత్తమామలతో పాటు కల్పనా కూడా అంగీకరించలేదు.

నా డబ్బులు నాకు ఇచ్చేయండి
ఇంతకాలం నేను సంపాధించిన డబ్బులు మొత్తం మీ ముఖాన వేశానని, నా డబ్బు నాకు ఇచ్చేయాలని నర్ము యాదవ్ అతని భార్య కల్పనాతో గొడవపడుతున్నాడు. భార్య కల్పనా పుట్టింటిలోనే నర్ము యాదవ్ కూడా ఉండటంతో అతనికి అత్తమామలు బుద్దిమాటలు చెబుతూ కూతురికి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇటీవల ఆస్తుల పంపకాల విషయంలో నర్ము యాదవ్ రచ్చరచ్చ చేశాడు.

అత్తమామలను నరికి చంపేశాడు
మద్యం సేవించి వెలుతున్న నర్ము యాదవ్ అతని భార్య కల్పనాను పట్టుకుని చితకబాదేస్తున్నాడు. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన నర్ము యాదవ్ అతని భార్య కల్పనాతో గొడవపెట్టుకున్నాడు. సహనం కోల్పోయి గొడ్డలి తీసుకుని భార్య కల్పనా మీద దాడి చేశాడు. అడ్డుపడిన అత్తమామలు భగవాన్, పుష్పా, కూతురు ముస్కాన్ మీద అదే గొడ్డలితో నరికేశాడు.
మద్యం మత్తులో నర్ము యాదవ్ గొడ్డలితో ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో అత్తమామలు భగవాన్, పుష్పా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తీవ్రగాయాలైన కల్పనా, ఆమె కూతురు ముస్కాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు.