లైంగిక వేధింపులకు కుటుంబం బలి: పోలీసుల కోసం సూసైడ్ నోట్, రూ.50 వేలు

ముంబై: యజమాని కీచక పర్వానికి మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ కుటుంబం బలైంది. తమపై యజమాని లైంగిక దాడికి ఒడిగట్టడంతో మనస్తాపం చెందిన కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడింది. తమకు జరిగిన అన్యాయంపై దర్యాప్తు జరిపేందుకు పోలీసులకోసం ఆ కుటుంబం ఇంట్లో రూ.50 వేలు సిద్ధంగా ఉంచడాన్ని బట్టి ఆ కుటుంబం మానసికంగా ఎంత చిత్రవధకు గురైందో అర్థమవుతోంది. కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

నగరంలోని అంధేరీ ప్రాంతంలో నివాసముండే టింకూసింగ్ ఇంట్లో భారతిపాల్ (25), సోమ్‌నాథ్ పాల్ (20) అనే అక్కాతమ్ముడు పనిచేస్తున్నారు. భారతిపాల్‌పై టింకూసింగ్ చాలాకాలంగా లైంగికదాడికి పాల్పడుతుండటమే కాకుండా సోమ్‌నాథ్‌ను తరుచూ చిత్రహింసలు పెడుతున్నాడని మృతులు రాసిన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. ఆ బాధలు భరించలేని వీరు టింకూ సింగ్ ఇంట్లోనే గత శుక్రవారం ఉరివేసుకొని మరణించారు.

Family Leaves Suicide Note and Rs. 50,000 for Cops

పిల్లలే సర్వస్వంగా భావించిన వారి తల్లి శిఖాపాల్, తన పిల్లలులేని లోకంలో తానుండలేనని లేఖ రాసి లోకండ్వాలాలోని తన ఇంట్లో శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భర్త, పిల్లల పెంపుడు తండ్రి అయిన అజిత్‌కుమార్ పటేల్‌కూడా ఆత్మహత్యచేసుకోవడం సంచలనం సృష్టించింది.

ఆత్మహత్యకుగల కారణాలను భారతిపాల్, సోమ్‌నాథ్, శిఖాపాల్ స్వయంగా వివరిస్తూ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ సెల్‌ఫోన్‌ను శిఖా మృతదేహం వద్ద పోలీసులు కనుగొన్నారు. దానిపై వీడియో చూడండి అని రాసి ఉందని మిడ్‌డే పత్రిక తెలిపింది. యుజమాని టింకూ సింగ్ భారతిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చినట్లు సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. భారతిపై అత్యాచారం జరగలేదని పోస్టుమర్టం నివేదికలో తేలింది. భారతి తన సోదరి వంటిదని, తాను ఆమెకు ఏ విధమైన హాని కూడా తలపెట్టలేదని సింగ్ పోలీసులకు చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+