Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీలో వారికి అధికారం ఇస్తే కుటుంబ పాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు: అమేథీలో మోడీ ఫైర్

2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించిన తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు ఓటు వేయని ప్రజల తెలివితేటలను తిడుతున్నారని కాంగ్రెస్ కంచుకోటలోని ఓటర్లను హెచ్చరిస్తూ యూపీలోని అమేథీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరికీ చెందరని అమేథీ ప్రజలకు ముందే తెలుసు అని పేర్కొన్నారు. మీరు చాలా కాలంగా ఈ కుటుంబాలకు విధేయులుగా ఉన్నారు. కానీ మీరు వారికి ఓటు వేయని మరుక్షణం వారు తిట్టడం ప్రారంభించారు. కేరళకు వెళ్లి మరీ మీపై శాపనార్థాలు పెడుతున్నారని పేర్కొన్నారు.

అమేథీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ అనేక రాజకీయ పార్టీలు చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు దేశాన్ని నష్టాల్లోకి నెట్టాయి అని పేర్కొన్నారు. ఈ రాజకీయాలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా జరుగుతున్నప్పటికీ ఈ నాయకులు వెనుకాడరని ప్రధాని మోడీ ఎస్పీని, కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేశారు. వారు మన ఆర్మీ మరియు పోలీసు బలగాలను అవమానిస్తారు, అప్పుడు వారి ఓటు బ్యాంకు వృద్ధి చెందుతుంది అని అమేథీ ర్యాలీలో ప్రధాని మోదీ అన్నారు. కుటుంబ పాలన చేసిన నాయకులు గ్రౌండ్ రియాలిటీకి చాలా దూరంగా ఉంటారన్నారు. వారికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియదని, వారికి అధికారం ఇస్తే తమ కుటుంబ అధికారాన్ని పెంచుకోవడానికి, రాజులు వలె పరిపాలన సాగించడానికి వారు ప్రయత్నిస్తారని పేర్కొన్నారు.

Family rule, vote bank politics if SP and Congress are given power in UP: Modi fires in Amethi

వారికి అధికారం ఇస్తే పదవులన్నీ వారి కుటుంబంలోని వారికే ఇస్తారని విమర్శించారు.కానీ బిజెపి ప్రజల శక్తితో నడుస్తుందని, గత ప్రభుత్వాలలా మాఫియా కాదని మోడీ పేర్కొన్నారు. రైతుల పట్ల తన పార్టీ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ఫిబ్రవరి 24 నా జీవితంలో ఒక ముఖ్యమైన రోజు. 'ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' కేంద్ర ప్రభుత్వ పథకం నేటికి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీ ఈ పథకాన్ని మూసివేస్తారని 2019లో పుకార్లు వ్యాప్తి చేసేవారు. ఎన్నికల తర్వాత మేము గెలిచాము ఆ తర్వాత కూడా ఈ పథకం కొనసాగిందని మోడీ పేర్కొన్నారు. అమేథీ రైతులకు రూ.450 కోట్లకు పైగా అందాయి అని ఆయన వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లో ఐదవ దశ పోలింగ్ ఫిబ్రవరి 27న జరగనుంది. ఐదవ దశ ఎన్నికల కోసం ప్రధాని మోడీతో పాటు బీజేపీ ముఖ్య నాయకులు యుద్ధ ప్రాతిపదికన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఇందులో 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అమేథీ నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఐదవ దశ యూపీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+