Family: రాత్రి భర్త చేసినపనికి ?, భార్య, ఐదు మంది కూతుర్లు రైలు కిందపడి, ఒక్కడే మిగిలాడు !
రాయ్ పూర్: నిత్యం భర్త ఇంట్లో గోడవ పడుతున్నాడని భార్య జీవితంపై విరక్తి పెంచుకునింది. ఇప్పటికే ఐదు మంది కుమార్తెలు ఉండటం, భర్త సక్రమంగా సంసారాన్ని పట్టించుకోకపోవడంతో భార్య నరకం అనుభవించింది. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్య, పిల్లలతో గొడవ పెట్టుకున్నాడు. భర్త చేష్టలతో విసిగిపోయిన భార్య ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. తాను ఆత్మహత్య చేసుకుంటే తన కుమార్తెలు అనాథలు అవుతారని ఆమె ఆవేదన చెందింది. కుమార్తెలతో కలిసి తల్లి వేగంగా వెలుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునింది.

సాహూకు ఐదు మంది కూతుర్లు
చత్తీస్ గఢ్ రాజధానికి 55 కిలోమీటర్ల సమీపంలోని మహాసముంద్ జిల్లాలోని బెలసోండ ప్రాంతంలో సాహూ, ఉమా సాహు (45) దంపతులు నివాసం ఉంటున్నారు. సాహు, ఉమా సాహు దంపతులకు అన్నపూర్ణ (18), యశోధ (16), భూమికా (14), కుంకుమ్ (12), తులసి (10) అనే ఐదు మంది కుమార్తెలు ఉన్నారు. సాహు, ఉమా దంపతులకు ఐదు మంది కుమార్తెలు కావడంతో కష్టం మీద వారిని పెంచిపోషిస్తున్నారు.

ఇంట్లో రోజూ గోడవలే
నిత్యం భర్త సాహుతో ఇంట్లో గోడవ పడుతున్న భార్య ఉమా జీవితంపై విరక్తి పెంచుకునింది. ఇప్పటికే ఐదు మంది కుమార్తెలు ఉండటం, భర్త సాహు సక్రమంగా పట్టించుకోకపోవడంతో ఉమా సాహు నరకం అనుభవించింది. భర్త చేష్టలతో విసిగిపోయిన ఉమా సాహూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. కుమార్తెలు అన్నపూర్ణ, యశోధ, భూమిక, కుంకుమ్, తులసిని పిలుచుకున్న ఉమా సాహు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.

భర్త చేసిన పనికి ఆరు మంది ప్రాణాలు ?
మహాసముంద్- బెల్సోండా రైల్వే మార్గం మధ్యలోని రైల్వేక్రాసింగ్ సమీపంలో వేగంగా వెలుతున్న రైలు కింద పడి తల్లీ, ఐదు మంది కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబంలో ఆరు మంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో మృతదేహాలు చెల్లాచెదురు అయ్యాయని మహాసముంద్ జిల్లా ఎస్పీ మేఘ తంబుద్కర్ మీడియాకు చెప్పారు.

ఫ్యామిలీలో ఒక్కడే మిగిలాడు
భర్త సాహుతో అతని భార్య ఉమా సాహు గొడవపడిన తరువాత అందరూ కలిసి ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని, కేసు విచారణలో ఉందని జిల్లా ఎస్పీ మేఘా తంబూద్కర్ అన్నారు. ఒకే కుటుంబంలో ఐదు మంది కూతుర్లు, తల్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు చలించిపోయారు. తన కోసం ఆరు మంది ప్రాణాలు పోయాయని సాహూ ఆవేదన చెందుతున్నాడని స్థానికులు అంటున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications