ఢిల్లీలో గెలుపు వారిదే- తేల్చేసిన ప్రముఖ సర్వే..!!

ఢిల్లీ ఎన్నికల్లో గెలుపెవరిది. హోరా హోరీగా సాగుతున్న ఢిల్లీ సమరంలో విజయం ప్రతీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారుతోంది. హర్యానా, మహారాష్ట్రలో విజయం సాధించిన బీజేపీ ఇక్కడ గెలిచి తమ హవా కొనసాగించాలని భావిస్తోంది. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని కేజ్రీవాల్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పోరాటం చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించటం లేదు. తొలుత త్రిముఖ పోటీగా భావించినా.. ఇప్పుడు రెండు పార్టీల మధ్యే పోటీగా మారుతోంది. తాజాగా సర్వే సంస్థలు గెలుపు అవకాశాలతో పాటుగా.. పార్టీల పరిస్థితి పై ఆసక్తి కర అంశాలు వెల్లడించాయి.

హోరా హోరీ పోరు
ఢిల్లీలో ఎన్నికలపై సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రీ పోల్ సర్వేలతో ఓటర్ల మూడ్ గుర్తించే పని ప్రారంభించాయి. ఫిబ్రవరి 3వ తేదీతో ప్రచారం ముగియనుంది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. హామీలను గుప్పించాయి. ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రచారానికి దిగుతున్నారు. మోదీ ప్రచారం పైన బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. అటు కేజ్రీవాల్ ప్రతీ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఆశించిన చొరవ చూపించటం లేదు. రాష్ట్ర స్థాయి నాయకత్వమే ప్రచార బాధ్యతలు తీసుకుంది. ఈ సమయం లోనే సర్వే సంస్థలు ఢిల్లీ ప్రజల మూడ్ ను వెల్లడిస్తున్నాయి.

Famous pre-poll surveys have predicted Delhi Assembly election results details here

సర్వేలో తేలిందేంటి
ఢిల్లీ ఎన్నికల్లో సగానికి పైగా ఓటర్లలో మహిళలే ఉన్నారు. ఎస్సీ ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది. దీంతో, మహిళలను ఆకట్టుకునేందుకు మూడు పార్టీలు తమ హామీల్లో ప్రాధాన్యత ఇచ్చాయి. కాగా, తాజా సర్వేల్లో మహిళా ఓటర్ల మద్దతు పైన తమ సర్వే అంచనాలను వెల్లడిం చాయి. నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్​ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్ -ది కన్వర్జెంట్ మీడియా సంయుక్తంగా జరిపిన సర్వేలో ఆసక్తి కర అంశాలు బయటకు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికల్లో మెజార్టీ దళిత ఓటింగ్ ఆప్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు. అదే విధంగా 44 శాతం మంది మహిళలు సైతం ఆప్ వైపే మద్దతుగా నిలుస్తున్నారని అంచనాలను వెల్లడించింది.

మారుతున్న లెక్కలు
దళిత ఓటింగ్ లో ఆప్ కు 35 స్థానాల్లో.. బీజేపీ 28, కాంగ్రెస్ 7 స్థానాల్లో మెజార్టీ సాధించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఢిల్లీలో 12 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ఈ సారి ఎస్సీ మోర్చా నేతలను ప్రచార బరిలోకి దించింది. ఇక, సామాజిక - స్థానిక అంశాలే ప్రధాన అస్త్రాలుగా పార్టీలు ప్రచారంలో కొత్త టర్న్ తీసుకున్నారు. ప్రచారం ఫిబ్రవరి 3న సాయంత్రం ముగియనుంది. దీంతో, ప్రత్యర్థుల వ్యూహాలకు ధీటుగా పార్టీలు కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. రోజు రోజుకీ మారుతున్న లెక్కలతో ఢిల్లీ అసెంబ్లీ సమరం మరింత ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+