సూపర్ సైక్లోన్ గా ఫణి .. 195 కి.మీ. వేగంతో పెనుగాలులు .. ఫణి తుఫానుపై మోడీ ట్వీట్

Recommended Video

    సూపర్ సైక్లోన్ గా ఫణి...! ఫణి తుఫానుపై మోడీ ట్వీట్..!! || Oneindia Telugu

    ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై వాయుగుండంగా, తుపానుగా మారిన 'ఫణి', ఇప్పుడు మరింత ఉద్ధృతమై సూపర్ సైక్లోన్ గా మారింది. ఇది ప్రస్తుతం మచిలీపట్నానికి 1,090 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై, గంటకు 20 నుంచి 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. అది తీరాన్ని తాకితే విధ్వంసం సృష్టిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సూపర్ సైక్లోన్ తీరం తాకే వేళ గంటకు 160 నుండి 195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

    సూపర్ సైక్లోన్ తీరం తాకే వేళ గంటకు 195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు

    సూపర్ సైక్లోన్ తీరం తాకే వేళ గంటకు 195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు

    తీవ్ర తుపానుగా ఉన్న సమయంలో గంటకు 110-125 కి.మీ., అతి తీవ్ర తుపానుగా మారాక 130-155 కి.మీ., సూపర్‌ సైక్లోన్‌ అయ్యాక 160-195 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ వెల్లడించింది. సముద్రంలో అలలు భారీగా ఎగసిపడతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.ఈ తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు , పుదుచ్చేరి రాష్ట్రాల తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

    దిశ మార్చుకునేవరకు ముప్పు తప్పినట్టుగా భావించలేం అంటున్న నిపుణులు

    దిశ మార్చుకునేవరకు ముప్పు తప్పినట్టుగా భావించలేం అంటున్న నిపుణులు

    మే 1 నుంచి తుపాను దిశను మార్చుకోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నా, అది జరిగేంత వరకూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ముప్పు తప్పినట్టుగా భావించలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ముప్పు తప్పినట్టు భావించలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    ఫణి గురించి విన్నాం .. ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ప్రార్దిస్తున్నా .. మోడీ ట్వీట్

    ఫణి గురించి విన్నాం .. ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ప్రార్దిస్తున్నా .. మోడీ ట్వీట్

    ఇక ప్రస్తుతం రాష్ట్రాలను వణికిస్తున్న 'ఫణి' తుపాను గురించి తాను విన్నానని, అధికారులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టారు. ఆయన, ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉండాలని, నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులకుఆదేశించారు . తుపాను ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలతో కలసి పనిచేయాలని ఆదేశించానని అన్నారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+