ఈ రోజే నిజమైన పండుగ .. స్వీట్స్ పంచి, డ్యాన్సులేసి సాగుచట్టాల రద్దుతో రైతన్నల సంబరాలు
వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ఉపసంహరించుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో శుక్రవారం ఢిల్లీ సమీపంలోని ఘాజీపూర్ సరిహద్దులో అన్నదాతలు సంతోషంతో సంబరాలను చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో రైతులు ఆందోళన చేస్తున్న సింగూ, తిక్రీ, ఘాజీపూర్ లలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

స్వీట్స్ పంచుకుంటూ డ్యాన్సులు చేస్తున్న రైతులు
సాగు చట్టాల రద్దు కోసం నిరసన తెలిపిన రైతులు ఘాజీపూర్ సరిహద్దులో జిలేబీలను పంపిణీ చేశారు . గత సంవత్సరం రూపొందించిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయం సాధించిన నేపథ్యంలో "కిసాన్ జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు. మరికొందరు వీధుల్లో డ్యాన్స్ చేస్తూ ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యూఢిల్లీ శివార్లలోని ఘాజీపూర్‌లో రైతులు వ్యవసాయ చట్టాల రద్దు వార్తలను తెలుసుకుని సంబరాల్లో మునిగిపోయారు. కొందరు బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు.ఏడాది కాలంగా పండుగలకు దూరంగా ఉన్న రైతులు పండుగ చేసుకుంటున్నారు.
గురునానక్ జయంతి నాడు ప్రకటన చేసిన పీఎం మోడీ
సాగు చట్టాల రద్దుపై రైతుల్లో ఆందోళన క్రమంగా పెరుగుతున్న సమయంలో ఊహించని విధంగా కేంద్రం యూ టర్న్ తీసుకోవటం రైతుల్లో పట్టరాని సంతోషానికి కారణంగా మారింది. గురునానక్ జయంతి సందర్భంగా, సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిపాటు నిరసనల అనంతరం ఈ కీలక నిర్ణయం ప్రకటించారు. దీంతో గురునానక్ జయంతి పర్వదినాన్ని రైతులు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇది మర్చిపోలేని జ్ఞాపకం అంటున్నారు. ఈ రోజే నిజమైన పండుగ అని రైతన్నలు సంబరాలు జరుపుకుంటున్నారు.

రైతుల నిరసన స్థలాలలో వెల్లివిరుస్తున్న సంతోషం
ఢిల్లీ-యుపి సరిహద్దులో ప్రధాని నరేంద్ర మోడీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత ఢిల్లీ-యుపి సరిహద్దు సమీపంలోని ఘాజీపూర్ రైతుల నిరసన ప్రదేశంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నామని మొత్తం దేశానికి చెప్పడానికి వచ్చాను. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో, ఈ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేస్తాం, "అని ప్రధాన మంత్రి ప్రకటన చేసి, ఆందోళనకారులను వారి ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభం కానున్నాయి.

ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం .. సర్వత్రా ఆసక్తి
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత ఉన్న పంజాబ్ మరియు ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి కొద్ది నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టకేలకు ఫలించిన రైతుల పోరాటాన్ని పలువురు నాయకులు అభినందించారు. రైతులు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరియు హర్యానా ఇతర రాష్ట్రాల నుండి దాదాపు ఒక సంవత్సర కాలం నుండి ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా విజయం సాధించినందుకు అభినందనలు, దేశంలోని రైతులు సత్యాగ్రహం ద్వారా అహంకారపూరిత ప్రభుత్వాన్ని తలొగ్గేలా చేశారు అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.

పార్లమెంట్ లో సాగు చట్టాలు రద్దు చేస్తేనే ఆందోళన విరమిస్తామన్న రైతులు
మరోవైపు భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ మాట్లాడుతూ నిరసనలు ఇంకా చల్లారబోవని అన్నారు. ఆందోళనను వెంటనే ఉపసంహరించుకోము, పార్లమెంటులో వ్యవసాయ చట్టాలను రద్దు చేసే రోజు కోసం మేము వేచి ఉంటాము. నిర్మిస్తామని ఎంఎస్‌పితో పాటు రైతుల ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వం చర్చించాలి' అని ఆయన ట్వీట్ చేశారు. నిరసనలో ముందంజలో ఉన్న సంయుక్త కిసాన్ మోర్చా కూడా పార్లమెంటరీ విధానాల ద్వారా ప్రకటన అమలులోకి వచ్చే వరకు వేచి చూస్తామని వెల్లడించింది.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications