వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10రోజులపాటు రైతుల సమ్మె: పాలు, కూరగాయల కొరత, పెరగనున్న ధరలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రభుత్వానికి వ్యతిరేఖంగా రైతుల ఆందోళన

న్యూఢిల్లీ: తాము పండించిన పంటలకు మద్దతు ధర లభించకపోవడంతో కడుపు మండిన రైతన్నలు సమ్మెకు దిగారు. పాలు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను శుక్రవారం నుంచి(జూన్1) 10రోజులపాటు అందించబోమని తేల్చి చెప్పారు. రైతుల బంద్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పోలీసులు భద్రతను పెంచారు.

చమురు ధరలు పెరగడం, రైతులకు ప్రభుత్వాలు రుణమాఫీ చేయకపోవడం, రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లతో అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ వేదికగా ఏకమై పలు సంఘాలు శుక్రవారం నుంచి 10రోజులపాటు సమ్మె నిర్వహిస్తున్నాయి.

Farmers Strike: High-alert sounded in MPs Mandsaur, supply of milk, vegetables to be hit

స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్ తదితర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లను హైవేలపై నిలిపేసి నిరసన చేపట్టారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక, రోడ్లపై పంటను పోసి నిరసన వ్యక్తం తెలుపున్నారు. 10రోజులపాటు సమ్మెకు దిగడంతో కూరగాయలు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు తీవ్ర కొరత తప్పదని, ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, కొందరు రైతులు మాత్రం తమ వద్దకు వచ్చి పాలు, కూరగాయలు కొనుగోలు చేయవచ్చని, తాము మాత్రం మార్కెట్లకు వెళ్లి అమ్మే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

English summary
Farmers across India are set to go on a 10-day strike again, a year after a first wave of farmer protests roiled the country. But while last year's farmer strike, which spread from Maharashtra to Madhya Pradesh and then to the rest of the country, united farmers at large, fractures are now becoming evident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X