వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబ్బ.. ప్లీజ్ నో.. రాష్ట్రపతి పదవీ పోటీకి ఫరూక్ నో.. కారణం ఇదే..?

|
Google Oneindia TeluguNews

రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థిపై క్లారిటీ రావడం లేదు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సమావేశం నిర్వహించిన క్యాండెట్ అంశం కొలిక్కి రాలేదు. నిన్నటి వరకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరు వినిపంచింది. కానీ ఆయన తాను పోటీ చేయబోనని స్పష్టంచేశారు. ఓడిపోతామని తెలిసీ కూడా.. బరిలో నిలువడం ఎందుకు అని ఆయన అనుకున్నారు. తర్వాత తెరపైకి సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా పేరు వచ్చింది. కానీ ఆయన కూడా నో అంటున్నారు. మరీ విపక్షాల నుంచి ఎవరూ బరిలో నిలువనున్నారు.

కశ్మీర్ కోసమే..

కశ్మీర్ కోసమే..

రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగాలని విపక్షాలు ఆయనను అడిగాయి. అయితే తాను కశ్మీర్ కోసం ఏమైనా చేయాలనుకుంటున్నానని కుండబద్దలు కొట్టారు. అంతే తప్ప రాష్ట్రపతి పదవీకి కాదని చెప్పారు. తాను బరిలో నిలువనని చెప్పానని పేర్కొన్నారు. ఇప్పుడు కశ్మీర్ సంక్లిష్టంగా ఉందని.. అందుకు తన సహాయ సహాకారాలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ఏదైనా చేయొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్ద పదవీతో ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని చెప్పకనే చెప్పారు.

ప్లీజ్ వద్దు

ప్లీజ్ వద్దు

అందుకోసమే తన పేరును పరిశీలన నుంచి తీసివేయాలని కోరారు. అయితే అంతకుముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా పోటీలో ఉండనని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. అతని పేరును ఢిల్లీలో సమావేశమైన 17 పార్టీలు ప్రతిపాదించాయి. ఇందులో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, శివసేన కూడా ఉన్నాయి. కానీ ఆయన కూడా సున్నితంగా తిరస్కరించారు.
 21న కౌంటింగ్

21న కౌంటింగ్


రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌ను ఈ నెల 15న జారీ చేశారు. ఆ రోజు నుంచే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌ం అయ్యింది. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తామ‌ని, 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంద‌ని తెలిపారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌ను జులై 18న నిర్వ‌హిస్తామని.. జులై 21న ఓట్ల లెక్కిస్తామని తెలిపారు.

English summary
National Conference chief Farooq Abdullah turned down the offer to be Opposition's presidential candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X