మోడీ బాటలో ఆనందీబెన్: ‘ఫాస్ట్‌ట్రాక్ గుజరాత్’ ప్లాన్
గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాటలోనే గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ నడుస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వందరోజుల ప్రణాళికను ఆమె ఆదర్శంగా తీసుకున్నారు. ఆనందీబెన్ పటేల్ తమ రాష్ట్రంలో కూడా వందరోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. దానికి ఆమె ప్రత్యేకంగా ఓ పేరు కూడా పెట్టారు. అదే ‘గతిశీల్ గుజరాత్' లేదా ‘ఫాస్ట్‌ట్రాక్ గుజరాత్' ప్రణాళిక.
ఈ ప్రణాళిక గురించి పూర్తి వివరాలతో బ్రోచర్లు, సీడీలు కూడా రూపొందించారు. జాతీయ సగటు కన్నా తక్కువగా ఉన్న పోషకాహార స్థితిని పెంపొందించడం, గ్రామాల్లో 50వేల మరుగుదొడ్ల నిర్మాణం, 75వేల ఉద్యోగాల కల్పనకు 300 జాబ్ మేళాల నిర్వహణ.. తదితర లక్ష్యాలను గుజరాత్ ముఖ్యమంత్రి ‘ఫాస్ట్ ట్రాక్'లో పేర్కొన్నారు.

గుజరాత్ పోలీస్ ఫోర్స్‌లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతంగా చేసేందుకు ఈ ప్రణాళిక తోడ్పడుతుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి నితిన్ పటేల్ అన్నారు.
గుజరాత్ తోపాటు మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకుని మోడీ వందరోజుల ప్రణాళిక మాదిరిగానే ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రణాళికలను రూపొందిస్తున్నారు.












Click it and Unblock the Notifications