వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనవరి1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి -లేకుండా వెళితే వాయింపు -FASTag ఎక్కడ, ఎలా కొనాలి?

|
Google Oneindia TeluguNews

కొత్త ఏడాది సందర్భంగా తీసుకునే కీలక నిర్ణయాల్లో ఫాస్టాగ్ ను కూడా చేర్చుకోవాలన్నది సర్కారు వారి సలహా. వివిధ రంగాలకు సంబంధించి కేంద్రంలోని మోదీ సర్కారు మార్పులు చేసిన నిబంధనలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వాటిలో ప్రధానమైనది ఫాస్టాగ్. జనవరి 1 నుంచి టోల్‌ గేట్ల వద్ద నగదు లావాదేవీలు ఉండవు. అన్నీ ఫాస్టాగ్ ద్వారానే జరగనున్నాయి.

మగాడిలా పుట్టిన అందాల ఆడబొమ్మ -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాకమగాడిలా పుట్టిన అందాల ఆడబొమ్మ -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాక

వచ్చే ఏడాది ప్రారంభం నుంచే.. అంటే జనవరి 1 నుంచే దేశంలోని అన్ని వాహనాలకు(టై, త్రీవీలర్లు మినహా) FASTag తప్పని కానుంది. అదే రోజు నుంచి టోల్ గేట్ల వద్ద పన్నుల్ని నూరు శాతం ఫాస్టాగ్ ద్వారానే వసూలు చేయాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో అది తప్పనిసరి వ్యవహారం అయింది. కొత్త సంవత్సరంలో మీరు కారులో ఊరికెళ్లాలంటే ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి. లేదంటే ప్రయాణం కష్టమేమరి..

FASTag from January 1: Here’s how to register, affix and recharge

మన వాహనాల విండ్‌స్క్రీన్‌పై ఉంచే ఫాస్టాగ్ స్టిక్కర్ లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది టోల్ ప్లాజాలోని స్కానర్‌కు నేరుగా కనెక్ట్ అవుతుంది. మన ఖాతా నుంచి డబ్బులు ఆటోమెటిగ్గా కట్ అయిపోతాయి. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఉంటే తప్ప జనవరి 1 నుంచి అనుమతి ఉండదు. వాలెట్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుకు ఫాస్టాగ్‌ను కనెక్ట్ చేయవచ్చు.

FASTag స్టిక్కర్లను NHAI తోపాటు 22 వేర్వేరు బ్యాంకుల నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది పేటీఎం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా లభిస్తుంది. ఇది కాకుండా, ఫినో పేమెంట్స్ బ్యాంక్ మరియు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఫాస్టాగ్ జారీ చేస్తాయి. FASTag NHAI ప్రీపెయిడ్ వాలెట్‌తో అనుసంధానం జరిగి ఉంటే, దాన్ని చెక్ ద్వారా లేదా యుపిఐ / డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెఫ్ట్ / నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటి ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం -ముస్లిం, యూదు పెద్దల వ్యతిరేకత -మత గ్రంథాల్లో ఏముంది?కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం -ముస్లిం, యూదు పెద్దల వ్యతిరేకత -మత గ్రంథాల్లో ఏముంది?

బ్యాంక్ ఖాతా ఫాస్ట్‌ట్యాగ్‌తో కనెక్ట్ అయి ఉంటే డబ్బు నేరుగా ఖాతా నుండి తీసివేయబడుతుంది. Paytm వాలెట్ ఫాస్ట్‌ట్యాగ్‌తో అనుసంధానించబడి ఉంటే, డబ్బు నేరుగా వాలెట్ నుండి తీసివేయబడుతుంది. ఫాస్టాగ్ ఖాతాలో ఎల్లప్పుడూ కనీసం రూ.100 ఉంచాలి. దాదాపు అన్ని బ్యాంకులు ఫాస్టాగ్ సర్వీసుల్ని అందిస్తున్నాయి. దీనికోసం మనం కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనాలకు తప్ప మరే ఇతర వాటికి ఫాస్టాగ్‌ చెల్లుబాటు కాబోదు.

ఇప్పటికే ఫాస్టాగ్ లేని వాహనాలను మార్షల్ లేన్లోకి అనుమతించడం లేదు. కానీ జనవరి 1 నుంచి ఆ ట్యాగ్ లేకుండా అసలు ఏ లైన్లోకి వెళ్లే అవకాశం ఉండదు. ఫాస్టాగ్ లేకుండా పొరపాటున మార్షల్ లేన్లోకి ప్రవేశిస్తే, మీరు రెట్టింపు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అందుచేత కొత్త సంవత్సరంలో ఊరికే డబ్బులు పోగొట్టుకోకుండా ఉండేలా వెంటనే ఫాస్టాగ్ ను సొంతం చేసుకోండి..

నివేదా పేతురాజ్ గ్లామరస్, బోల్డ్ ఫోటోలు.. అందానికి అందంగా బ్యూటీ

రెండేళ్లలో భారత్ ను టోల్ గేట్ ఫ్రీ దేశంగా మారుస్తామని కేంద్రం చెబుతోంది. కొత్త వాహనాలకు ఫాస్టాగ్ అందుబాటులో ఉన్నా, 2017, డిసెంబర్ 1 కంటే ముందునాటి వాహనాలకు (నాలుగు చ‌క్రాల) ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందేనని కేంద్రం చట్ట సవరణ చేసింది. దీంతో తప్పనిసరి ఫాస్టాగ్ నిబంధన అమలులోకి వచ్చినట్లయింది.

English summary
The Union government of India has mandated the installation and use of FASTags for all four-wheelers in India. Introduced by the National Highways Authority of India (NHAI), FASTags is a sticker to be pasted on a car’s windshield and it allows automatic electronic collection of toll at toll plazas. As the vehicle passes the toll booth, the FASTag is scanned and the toll fee is deducted automatically, without the vehicles having to wait at the toll gate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X