వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫాస్టాగ్: నేటి నుంచి దేశమంతా తప్పనిసరి.. లేకపోతే డబుల్ బాదుడే.. కీ పాయింట్స్ ఇవే...

|
Google Oneindia TeluguNews

జాతీయ రహదారులపై టోల్ ప్లాజా చెల్లింపులకు కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టాగ్(FASTag) విధానం సోమవారం(ఫిబ్రవరి 15) నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. దేశంలోని అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఇది తప్పనిసరి. కాబట్టి వాహనాదారులు ఇకపై ఫాస్టాగ్ లేకుండా టోల్ ఫీజు చెల్లించడం కుదరదు. సోమవారం నుంచి టోల్ గేట్ల వద్ద ఉండే అన్ని లేన్లు ఫాస్టాగ్ విధానంలోనే పనిచేయనున్నాయి. ఒకవేళ ఫాస్టాగ్ లేని వాహనం టోల్ గేట్ దాటాలంటే డబుల్ చార్జీలు చెల్లించక తప్పదు.

ఎందుకీ ఫాస్టాగ్...

ఎందుకీ ఫాస్టాగ్...

నిజానికి జనవరి 1,2021 నుంచే ఫాస్టాగ్ విధానాన్ని అమలుచేయాలని కేంద్రం మొదట భావించింది. కానీ ఆ తర్వాత ఫిబ్రవరి 15కి దాన్ని వాయిదా వేసింది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్‌ను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. తద్వారా టోల్ చెల్లింపుకు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్‌ల జారీ కోసం కేంద్రం ఇప్పటికే 23 బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫాస్టాగ్‌లను తమ బ్యాంకు ఖాతాలకు అనుసంధానించుకోవడం ద్వారా, లేదా ప్రీ-పెయిడ్‌ పద్ధతిలో రీచార్జ్‌ చేసుకోవడం ద్వారా అందులో బ్యాలెన్స్ అందుబాటులో ఉంచుకోవచ్చు.

ఫాస్టాగ్ ఎలా పనిచేస్తుంది...

ఫాస్టాగ్ ఎలా పనిచేస్తుంది...


సింపుల్‌గా చెప్పాలంటే ఫాస్టాగ్ అనేది ఒక బార్ కోడ్‌తో కూడిన స్టిక్కర్. ఆ బార్‌ కోడ్‌లో వాహన రిజిస్ట్రేషన్ వివరాలు పొందుపరచబడి ఉంటాయి. దీన్ని వాహనం ముందు అద్దంపై లేదా సైడ్ మిర్రర్‌పై అతికిస్తారు. ఫాస్టాగ్ స్టిక్కర్‌ను జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు అది చెల్లుతుంది. వాహనం టోల్ గేట్ గుండా వెళ్తున్నప్పుడు... అక్కడ ఉండే స్కానింగ్ మెషీన్ బార్‌ కోడ్‌ను ఆటోమేటిక్‌గా స్కాన్ చేస్తుంది. దీంతో ఆ బార్ కోడ్‌తో అనుసంధానించబడిన డిజిటల్ వాలెట్ ఖాతా నుంచి ఆటో‌మేటిక్‌గా టోల్ చెల్లింపు జరుగుతుంది. తద్వారా టోల్ గేట్ వద్ద నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. అలాగే టోల్ సిబ్బందికి నగదు చెల్లింపుల్లో చిల్లర సమస్యలు కూడా తలెత్తవు.

ఫాస్టాగ్ స్టిక్కర్ ఎక్కడ పొందాలి...

ఫాస్టాగ్ స్టిక్కర్ ఎక్కడ పొందాలి...

ఫాస్టాగ్ స్టిక్కర్‌ను ఆయా బ్యాంకులతో పాటు డిజిటల్ పేమెంట్స్‌ యాప్స్ అందిస్తున్నాయి. కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తే.. ఫాస్టాగ్ స్టిక్కర్ నేరుగా ఇంటికే డెలివరీ అవుతుంది. దీన్ని వాహనం ముందు అద్దంపై అతికిస్తే సరి. జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజా కౌంటర్ల వద్ద కూడా ఫాస్టాగ్‌ స్టిక్కర్స్‌ను విక్రయిస్తారు. వాహనదారులు అక్కడ కూడా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇకపై ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజాలోకి అడుగుపెడితే డబుల్ చార్జీల బాదుడు తప్పదు.

Recommended Video

#TOPNEWS: FASTag | LPG Price Hike- To Cost ₹ 50 More| AP Municipal Elections
ఎంత ఖర్చు అవుతుంది...

ఎంత ఖర్చు అవుతుంది...

ఫాస్టాగ్ స్టిక్కర్‌కు ఎంత ఖర్చు అవుతుందన్నది మీ వాహనం,వాణిజ్య అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ బ్యాంక్ లేదా డిజిటల్ పేమెంట్ యాప్ నుంచి తీసుకుంటున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పేటీఎం డిజిటల్ పేమెంట్ యాప్ దీన్ని రూ.500కి అందిస్తోంది. ఇందులో రూ.250 రీఫండ్ చేస్తారు. రూ.150 కనీస బ్యాలెన్స్‌గా ఉంటుంది.ఫాస్టాగ్ స్టిక్కర్‌ జారీ అయిన 24 నుంచి 48 గంటల్లో అది యాక్టివ్ అవుతుంది. టోల్ ప్లాజాను చేరుకునే 30నిమిషాల ముందుగానే డిజిటల్ వాలెట్ నుంచి అందులో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు,రాజకీయ నాయకులు,అత్యవసర సేవల విభాగంలో పనిచేసే ఉద్యోగులకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఉంటుంది.

English summary
FASTag is being made mandatory for all vehicles in India from February 15, 2021. To reduce vehicular traffic at the toll plazas, the Government of India (GOI) has mandated all toll plazas, pan India, to make toll payments electronic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X