4 లక్షల కోట్లతో సమగ్రాభివృద్ధి దిశగా హైదరాబాద్ మెట్రో!
హైదరాబాద్ మహానగర రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మహానగరంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా పెరగడంతో దేశ విదేశాల నుండి ఉద్యోగాల కోసం వస్తున్న వారిని భాగ్యనగరం ఆకర్షిస్తుంది. అంతేకాదు పలు ఇంటర్నేషనల్ విద్యాసంస్థలు కూడా హైదరాబాద్లో సేవలను అందిస్తున్న క్రమంలో చదువు కోసం వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
మెట్రో నెట్వర్క్ వ్యవస్థను విస్తరించనున్న హెచ్ఎండీఏ
ఈ పరిణామాలు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను బాగా పెంచాయి. అయితే హైదరాబాద్లో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి, ఉద్యోగాలు చేసే వారికి ప్రయాణాలను సులభం చేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటికే మెట్రో రైళ్ల ద్వారా తమ సేవలను అందిస్తోంది.అయితే పెరుగుతున్న అవసరాల దృష్ట్యా హెచ్ఎండిఏ, 2050 నాటికి మెట్రో నెట్వర్క్ వ్యవస్థను మరింత విస్తరించాలని నిర్ణయించింది.

2050 సంవత్సరం నాటికి ప్లాన్ ఇదే
2050 సంవత్సరం నాటికి మెట్రో నెట్వర్క్ ను 556.6 కిలోమీటర్లకు విస్తరించనున్నారు. ప్రస్తుతం 70 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించి ఉండగా, రెండో దశలో 150 కిలోమీటర్లు విస్తరణకు అనుమతులు రాగా, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం నెట్వర్క్ ను 336.4 కిలోమీటర్లకు, రోడ్ల నెట్వర్క్ ను 19,352 కిలోమీటర్లకు పెంచనున్నారు.
ఈ నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసిన హెచ్ఎండీఏ
ఇదే సమయంలో కొత్తగా 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కై వాక్ లను నిర్మాణం చేయడానికి కూడా హెచ్ఎండిఏ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. హైదరాబాద్ నగరం మధ్య నుంచి వెళుతున్న మూసీ నదిపై 29 బ్రిడ్జ్ లను నిర్మించనున్నారు. మొత్తం 34 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, 16 రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఎనిమిది ఎలివేటెడ్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు.
నాలుగు లక్షల కోట్లు అవసరం అవుతాయని హెచ్ఎండిఏ అంచనా
2050 సంవత్సరం నాటికి ప్రత్యేక బస్సు లైన్ ల కోసం 48 కిలోమీటర్ల ప్రత్యేక బస్సులను కారిడార్లను, ఏడు అంతర్రాష్ట్ర బస్సు, ట్రక్ టెర్మినల్స్ ను ఏర్పాటు చేస్తారు. ఈ సమగ్ర రవాణా ప్రణాళికకు నాలుగు లక్షల కోట్ల అవసరం అవుతాయని హెచ్ఎండిఏ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో, హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి ఈ ప్రణాళికను అమలు చేయడం తప్పనిసరి అయిన భావిస్తోంది హెచ్ఎండిఏ.












Click it and Unblock the Notifications