ఘోర ప్రమాదం: గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఏపీకి వస్తున్న ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
చెన్నై: తమిళనాడులోని చెన్నై శివారులో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువళ్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగివున్న గూడ్స్ రైలును ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో రెండు బోగీలు మంటలు చెలరేగడంతో దగ్ధమయ్యాయి. పలువురు ప్రయాణికులు గాయపడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
మైసూరు - దర్బాంగా మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలుగా ఎక్స్‌ప్రెస్ రైలుగా గుర్తించారు. పట్టాలపై నిలబడి ఉన్న సరుకు రవాణా రైలును అతి వేగంతో వచ్చిన ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలు బోగీలు పట్టాలు తప్పాయి.

మరికొన్ని బోగీల్లో మంటలు చెలరేగడంతో రెండు బోగీలు దాదాపు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Near Kavaraipettai in Thiruvallur, a passenger train collided with a goods train. The #Mysuru to Darbhanga Express crashed into the goods train.
— South First (@TheSouthfirst) October 11, 2024
Four AC compartments derailed. The accident occurred near the railway station, allowing immediate rescue operations to begin.
Two… pic.twitter.com/MrY5LK1Tc9
బోగీల్లో చిక్కుకున్నవారిని సహాయక సిబ్బంది బయటికి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్ లు, రెస్క్యూ వాహనాలను అధికారులు అందుబాటులో ఉంచారు. ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు వీలుగా బస్సులు, తాగునీరు వంటి వసతులను సిద్దం చేసినట్లు తిరువళ్లూరు జిల్లా అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదం కారణంగా నెల్లూరు-చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications