మహారాష్ట్రలో ఘోర ప్రమాదం...ఐదుగురు మృతి.. న‌లుగురికి గాయాలు..

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ముంబై నాసిక్ హైవేపై న్యూ కసర ఘాట్ సమీపంలో జ‌రిగిన ఓ ఘోర ప్ర‌మాదంలో పాల ట్యాంకర్ సుమారు మూడువంద‌ల అడుగుల దిగువకు ఉన్న ఓ లోయ‌లో ప‌డింది. దీంతో ఈ ఘోర ప్ర‌మాదంలో అక్క‌డిక్క‌డే ఐదుగురు మృతిచెంద‌గా, మ‌రో నలుగురు ప్ర‌యాణికుల‌కు తీవ్రంగా గాప‌డిన‌ట్లు తెలుస్తోంది. థానె జిల్లాలోని కాసర్‌ ఘాట్‌ కొండ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్న‌ట్లు స‌మాచారం.

ఈ విష‌యం తెలుసుకున్న విపత్తు నిర్వహణ బృందం, హైవే పోలీసులు హుటాహుటినా ప్ర‌మాద‌స్థ‌లానికి చేరుకుని సహాయక చర్యలు చేప‌ట్టారు. అయితే భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న‌ట్లు అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ బృందం సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను బయటకు తీయ‌డంతోపాటు క్ష‌త‌గాత్రుల‌ను తాళ్లతో పైకి తీసుకొచ్చి స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Fatal accident in Maharashtra Five killed Four injured

ఇంకా అక్క‌డ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. స్థానికుల ఇచ్చిన పూర్తి వివ‌రాల మేర‌కు.. పాల ట్యాంకర్‌ ముంబయి వెళుతున్న క్ర‌మంలో, కొండపై మలుపు దగ్గర డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో వాహనం అదుపుత‌ప్పి సుమారు 300 అడుగుల లోయలో పడిపోయింది. దీంతో సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+