Viral Video: 'యే రాతేన్ యే మౌసమ్' అంటూ పాట పాడిన తండ్రికూతుళ్లు.. వీడియో వైరల్..
సోషల్ మీడియా వచ్చిన నుంచి ప్రతి ఒక్కరు తమలో ఉన్న టాలెంట్ ను బయట పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ వీడియోల్లో కొన్ని వినోదాన్ని పంచగా.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని కోపం లేదా భావోద్వేగానికి గురి చేస్తాయి. తాజాగా తండ్రి,కూతురు కలిసి పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కిషోర్ కుమార్, ఆశా భోంస్లే..
ఈ వీడియో తండ్రి అతని కుమార్తె కలిసి బాలీవుడ్ క్లాసిక్ పాటను పాడారు.ఈ వీడియోను ఐపీఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తండ్రి,కూతురు 'యే రాతేన్ యే మౌసమ్' అని పాట పాడారు. ఢిల్లీ కా థగ్ చిత్రంలో ఈ పాటను కిషోర్ కుమార్, ఆశా భోంస్లే పాడారు. ప్రస్తుతం తండ్రికూతుళ్లు పాడిన పాట వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

40 వేలకు పైగా వ్యూస్..
ఈ వీడియోకు కొన్న గంటల్లోనే నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోకు 40 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వారి పాటుకు, నటనను పొగుడుతున్నారు. వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Awesome Dad-Daughter Duet.❤️ pic.twitter.com/H2l7g0Bjfu
— Awanish Sharan (@AwanishSharan) July 17, 2022












Click it and Unblock the Notifications