Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫిబ్రవరి 14 చీకటి రోజు: పుల్వామా ఉగ్రదాడికి నాలుగేళ్లు, భారత్ ప్రతీకారం, టైమ్‌లైన్ ఇలా

ఫిబ్రవరి 14 భారతదేశ చరిత్రలో ఇదో చీకటి రోజు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఈరోజునే భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు అత్యంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14 భారతదేశ చరిత్రలో ఇదో చీకటి రోజు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఈరోజునే భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు అత్యంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు. 2019, ఫిబ్రవరి 14న మధ్యాహ్నం జేషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు. ఆ తర్వాత భారత్ ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది జవాన్లు

ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది జవాన్లు

ఫిబ్రవరి 14, 2019లో జమ్మూ కాశ్మీర్‌లో నలభై మంది సీఆర్‌పిఎఫ్ సభ్యులు ప్రయాణిస్తున్న రెండు బస్సులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో హైవే వెంట ప్రయాణిస్తున్న పారామిలటరీ వాహనాల్లో సీఆర్పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. దాడి జరిగిన కొద్దిసేపటికే జేఈఎం ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఈ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించింది. ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ అని ప్రకటించారు. అతను దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గుండిబాగ్, కాకాపోరాలో నివసించే స్థానిక కాశ్మీరీ జిహాదిస్ట్ కావడం గమనార్హం.

పుల్వామా దాడులపై భారత్ ఆగ్రహం: మోడీ హెచ్చరిక

పుల్వామా దాడులపై భారత్ ఆగ్రహం: మోడీ హెచ్చరిక

ఫిబ్రవరి 15, 2019న ఒక పత్రికా ప్రకటనలో.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని భారత విదేశాంగ శాఖ మండిపడింది. పాక్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో తన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి, విస్తరించడానికి.. ప్రతీకార చర్యలకు భయపడకుండా భారతదేశంలో, ఇతర ప్రాంతాలలో దాడులు చేయడానికి జైషే మహ్మద్ నాయకుడు మసూద్ అజార్‌కు పూర్తి స్వేచ్ఛను మంజూరు చేసిందని పాకిస్థాన్‌పై ధ్వజమెత్తింది. అయితే, పుల్వామా దాడిలో తాము పాల్గొన్నట్లు భారత్ చేస్తున్న ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. మసూద్ అజార్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు కాదని చైనా వంతపాడింది. ఈ క్రమంలో బాధ్యులైన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలకు స్వేచ్ఛనిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇలాంటి దాడులకు పాల్పడి భారత్‌ను బలహీనపరచలేరని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. పుల్వామా ఉగ్రదాడిపై నిరసనలు వెల్లువెత్తడంతో ముందుజాగ్రత్తగా జమ్మూలో కర్ఫ్యూ విధించారు.

పుల్వామా దాడుల తర్వాత పాకిస్థాన్‌కు షాకిస్తూ భారత నిర్ణయాలు

పుల్వామా దాడుల తర్వాత పాకిస్థాన్‌కు షాకిస్తూ భారత నిర్ణయాలు


16 ఫిబ్రవరి 2019న రాజకీయ పార్టీలు భద్రతా దళాలకు మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. ఆ తర్వాత అన్ని పాకిస్తానీ వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 200 శాతానికి పెంచింది భారత ప్రభుత్వం. జెఎమ్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో కనీసం ఏడుగురిని పుల్వామా నుంచి అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక, పాకిస్థాన్‌పై భారత్ దౌత్యపరమైన దాడిని ప్రారంభించింది. భారత చర్యల నేపథ్యంలో పాక్ హడలెత్తిపోయింది. ఘోరమైన దాడికి పాల్పడిన వారిని గుర్తించడానికి భారతదేశంతో కలిసి పనిచేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందని హామీ పాక్ విదేశాంగ శాఖ తెలిపింది.

పుల్వామా దాడితో భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. భారతదేశం తన అత్యంత ప్రాధాన్య దేశంగా పాకిస్తాన్‌కు ఉన్న హోదాను తీసివేసింది. భారతదేశంలోకి దిగుమతి అయ్యే అన్ని పాకిస్తానీ వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 20%కి పెంచింది. భారత ప్రభుత్వం ప్రకారం.. మనీలాండరింగ్ (FATF)పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బ్లాక్ లిస్ట్‌లో పాకిస్థాన్‌ను చేర్చాలి. జమ్మూ కాశ్మీర్ ప్రభు త్వం ఫిబ్రవరి 17న వేర్పాటువాద నేతలకు భద్రతా తొలగించింది.

పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం దాడులు

పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం దాడులు

2019, ఫిబ్రవరి 26 తెల్లవారుజామున.. సీఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసిన పన్నెండు రోజుల తర్వాత భారత వైమానిక దళం జెట్‌లు బాలాకోట్, పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని జేఈఎమ్ శిబిరంపై బాంబు దాడులు చేశాయి. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత, మన యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. పన్నెండు మిరాజ్ 2000 విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. పాకిస్తాన్‌లోని జైష్-ఎ-మహ్మద్ శిబిరాలపై, నియంత్రణ రేఖ వెంబడి 1,000 కిలోల బాంబులు వేయడానికి ఆపరేషన్ నిర్వహించారు. పాకిస్తాన్‌లోని బాలాకోట్ సెక్టార్‌లోని జేఎమ్ క్యాంపు ఆపరేషన్ ఫలితంగా పూర్తిగా ధ్వంసమైంది. సుమారు 300 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారు.

భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం: తిరిగొచ్చిన అభినందన్

భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం: తిరిగొచ్చిన అభినందన్


ఈ క్రమంలో భారత్-పాకిస్థాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన నేపథ్యంలో పాక్.. భారత సైన్యంపై దాడులకు యత్నించింది. ఫిబ్రవరి 27, 2019న పాకిస్తాన్ F-16 విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. నివేదికల ప్రకారం అవి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఒక ఎఫ్-16 విమానం, రెండు భారతీయ మిగ్-21 బైసన్స్ ధ్వంసమయ్యాయి. ఐఏఎఫ్ నుంచి ఇద్దరు పైలట్లను తీసుకున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఆ తర్వాత, పాకిస్థాన్‌కు కేవలం ఒక ఐఏఎఫ్ పైలట్ మాత్రమే కస్టడీ ఉందని తన ప్రకటనను మార్చుకుంది. పట్టుబడిన ఐఏఎఫ్ పైలట్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను పాకిస్థాన్‌ వీడియోలో కనిపించారు. భారత ప్రభుత్వ చర్యలతో.. పట్టుబడిన పైలట్ వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 28న ప్రకటించారు. ఈ క్రమంలో సురక్షితంగా అభినందన్ భారత్ చేరుకున్నారు. ఫిబ్రవరి 27న జరిగిన వైమానిక దాడిలో భారత్‌పై పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 విమానాలను ఉపయోగించినట్లు మూడు సర్వీసుల చీఫ్‌లు మీడియా సమావేశంలో సాక్ష్యాలను ప్రదర్శించారు. కాగా, ఫిబ్రవరి 14 భారత చరిత్రలో ఓ విషాదం, చీకటి రోజుగా మిగిలిపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+