ఇంకెప్పుడూ సాఫ్టువేర్ కంపెనీలో పని చేయను!, దురదృష్టవశాత్తూ టెక్కీనయ్యా: బెంగళూరు టెక్కీ
Recommended Video

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ట్రాఫిక్ జామ్, ఉద్యోగ ఒత్తిడిలకు నిరసనగా తన ఉద్యోగం చివరి రోజు గుర్రం పైన వెళ్లాడు. ఇది ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంపై ఆయన కూడా ఆశ్చర్యపోయారు.
ఆయన మాట్లాడుతూ.. తాను గత ఎనిమిదేళ్లుగా బెంగళూరులో ఉంటున్నానని, ఇక్కడ తాను ట్రాఫిక్ జామ్, ఎయిర్ పొల్యూషన్ చూస్తున్నానని చెప్పారు. ప్రతి రోజు ట్రాఫిక్ జామ్ చూస్తున్నానని తెలిపారు. అందుకే తాను గుర్రంపై ప్రయాణించానని చెప్పారు.

తాను ఇక ఏ కంపెనీలో పని చేయనని, సొంత వెంచర్ ప్రారంభిస్తానని తెలిపారు. తనలాంటి ఆలోచనలు కలిగిన వారితో సొంత వెంచర్ ప్రారంభిస్తానన్నారు. తాను ఉద్యోగం వదలడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. తాను టెక్నికల్ ఫీల్డును వదలడం లేదని, కానీ ఎంఎన్‌సీ కంపెనీలలో ఉద్యోగం చేయడం మాత్రమే వదిలేశానని తెలిపారు.
ఆటో రిక్ష.. ఇలా ఎక్కడ చూసినా సొంత యూనియన్లు ఉన్నాయని, కానీ సాఫ్టువేర్ ఇంజినీర్లకు మాత్రం లేదన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులను ఏమాత్రం పట్టించుకోవని వాపోయారు. ఒత్తిడిలో పని చేస్తారన్నారు.

గత కొన్నేళ్లుగా తాను స్టార్టప్‌ల గురించి రీసెర్చ్ చేస్తున్నానని చెప్పారు. తనలాంటి ఆలోచనలు కలిగిన వారితో నిత్యం టచ్‌లో ఉన్నానని చెప్పారు. ఉద్యోగంతో విసిగిపోయిన వారితో టచ్‌లో ఉన్నానని చెప్పారు. తనకు ఆర్మీలో పని చేయాలనే కోరిక ఉండేదని, కానీ ఇప్పుడు అది కుదిరే పని కాదన్నారు. దురదృష్టవశాత్తు తాను సాఫ్టువేర్ ఇంజినీర్ అయ్యానని చెప్పారు.
కాగా, సదరు టెక్కీ ఎనిమిదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. కానీ జీవితం నరకప్రాయమైంది. అందుకు మొదటి కారణం ట్రాఫిక్ ఇబ్బందులైతే, రెండో కారణం సాప్టువేర్ రంగంలో కొనసాగుతున్న శ్రమదోపిడీ. దీంతో విసుగెత్తి అందుకు నిరసనగా గుర్రం మీద ఆఫీసుకొచ్చాడు. లైఫ్‌లో ఇంకెప్పుడు మల్టీ నేషనల్ కంపెనీలో పని చేయనని చెప్పాడు. కాగా, ఇతనిది రాజస్థాన్.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications