వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్నిగోళంగా ఉత్తర భారతం: ఈ నగరాల్లో హై టెంపరేచర్, కొన్నేళ్లలో లేనివిధంగా..

|
Google Oneindia TeluguNews

ఈ సారి అధిక మాసం వచ్చింది. దీంతో వేసవి నెల రోజులు ఆలస్యంగానే ప్రారంభమయ్యింది. అయితే ఉత్తర భారతం మాత్రం వేడికి అట్టుడుకుతోంది. వేడితో జనం ఇబ్బంది పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 33.1 డిగ్రీ సెల్సియష్ ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి నెలలో ఈ స్థాయిలో టెంపరేచర్ నమోదవడం 11 ఏళ్లలో తొలిసారి అని భారత వాతావరణ శాఖ ప్రతినిధులు తెలిపారు.

ఏప్రిల్ 1, 2వ తేదీల్లో కాస్త వాతావరణ చల్లబడ్డ తర్వాత మాత్రం వేడి పెరుగుతోంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి టెంపరేచర్ మరింత పెరగనుంది అని తెలియజేశారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో అందుకు అనుగుణంగా శరీరాన్ని మార్చుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. తూర్పు, మధ్య, ఈశాన్య భారత దేశంలో వాతావరణం వేడెక్కుతోందని తెలియజేశారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా టెంపరేచర్ పెరుగుతుందని వివరించారు.

Feel Like Youre Living in a Cauldron? As Heatwave Grips North India, Heres What to Expect Ahead

ఉత్తర భారత దేశం ముఖ్యంగా రాజస్తాన్‌లో వేడి ఎక్కువగా ఉండనుంది. సోమవారం 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చింది. ఇదీ 76 ఏళ్లలో అత్యధికం అని పేర్కొన్నారు. గుజరాత్, హర్యానాలో కూడా ఉష్ణోగ్రత నమోదవుతుందని వివరించారు. ఇటు కోల్ కతా, ముంబై, హైదరాబాద్‌లో కూడా టెంపరేచర్ పెరుగుతుందని తెలియజేశారు. అయితే పశ్చిమ బెంగాల్‌లో కొన్నిచోట్ల మాత్రం వేడి నుంచి ఉపశమనం కలుగనుంది.

English summary
Trouble boils and bubbles in northern and other parts of the country as the regions turned into ‘cauldrons’ in March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X