అయోధ్య రామందిరం ప్రారంభానికి ప్రధాని మోడీకి ఆలయ ట్రస్ట్ ఆహ్వానం: చారిత్రక సందర్భం ఎప్పుడంటే?

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం (Ram Mandir)ప్రారంభోత్సవానికి తేదీ ఖరారైంది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించి వచ్చే ఏడాది అంటే 2024, జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలో కలిసి ఆహ్వానించారు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు.

ప్రధాని మోడీని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని ప్రదాని స్వయంగా అంగీకరించారు. ఈ కార్యక్రమానికి రావడం తనకు మహత్భాగ్యమని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Feel Very Blessed: PM Modi invited to install Lord Rams idol at Ayodhya temple on Jan 22

'ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోద్యకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం' అని మోడీ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

ప్రధానితో సమావేశం అనంతరం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. 2024 జనవరి 22న ఆలయ గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామలల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి.. పది రోజులపాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించినట్లు సమాచారం.

కాగా, మూడంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయ భవనం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా ఇటీవల వెల్లడించారు. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+