• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పుర‌స్కారాలు పొట్ట‌నింప‌వు..!స‌న్మాన స‌భ‌లోనే క‌న్నీళ్లు..!ఆర్థిక సాయం కావాలంటున్న ప‌ద్మ‌శ్రీ గ్ర‌హత

|

హైద‌రాబాద్ : వ‌జ్ర వైఢూర్య‌లు, క‌న‌క‌మేడ‌ల సింహాస‌నాలు, హిమాల‌య ప‌ర్వాతాలంత కీర్తి, ముల్లోకాల‌ను ఎదురించే సాహ‌సం ఇవ‌న్నీ ఆక‌లి ముందు బ‌లాదూరే..! ఆక‌లేసిన‌ప్పుడు నాలుగు మెతుకులు లోప‌ల‌కు వెళ్లాయా..? లేదా? అన్న‌దే ముఖ్యం ఇక్క‌డ‌. అచ్చు ఇలాంటి స‌ఘ‌ట‌నే ప‌క్క రాష్ట్రం ఒడిశాలో చోటుచేసుకుంది. ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత కమలా పూజారి ఓ సత్కార సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు.

రెండు చోట్ల కాంగ్రెస్ తో ఫ్రెండ్లీ ఫైట్..ఓ స్థానంపై పేచీ: మిగిలిన సీట్లల్లో సర్దుబాటు

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసినందుకు ఇటీవల ఆమె దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా జయపురంలోని ఎమ్‌.ఎస్‌.స్వామినాథన్‌ ఫౌండేషన్‌ పరిశోధనా కేంద్రంలో ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కమలా పూజారి పూట గడవని తన కుటుంబ దీన స్థితిని తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

felicitations not feed hungry stomachs..! Padma Shri awardee cried on the state for financial support..!!

ఇలాంటి పురస్కారాలు తమకు పొట్టనింపవని, తనకు ఏదైనా ఆర్థిక సహాయం అందితే బాగుంటుందని ఆకాంక్షించారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా స్తబ్దుగా మారింది. వందలాది పురాతన వరి వంగడాలను ఇంట్లో మట్టి కుండల్లో భద్రపర్చిన విషయాన్ని తెలుసుకున్న స్వామినాథన్‌ ఫౌండేషన్‌ శాస్త్రవేత్తలు తనను బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. ఒడిశా ప్రభుత్వం తనకు రాష్ట్ర ప్రణాళిక సంఘంలో సభ్యురాలిగా చేశారు.

felicitations not feed hungry stomachs..! Padma Shri awardee cried on the state for financial support..!!

ఇప్పుడు పద్మశ్రీ అందజేశారు. ఇవేవీ తన పేదరికాన్ని నిలువరించలేకపోయాయన్న ఆమె మాటలు అందరినీ కలచివేశాయి. అంతకు ముందు జయపురం సిటీ బాలికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో స్కూల్‌ యాజమాన్యం, తెలుగు సాంస్కృతిక సభ్యులు కూడా కమలాను సత్కరించడం గ‌మ‌నార్హం.

English summary
Kamala Pujari, a recipient of the Padma Shri award from Koraput district in Odisha, tears in a Satkar Sabha. Recently she won the Padma Shri award by President Rajnath Kovind in Dilli for her remarkable efforts in agriculture. She was honored by the MS Swaminathan Foundation Research Center in Jayapuram. Kamala Pujari, who spoke on the occasion, was cried of thinking about his family's misfortune.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more