Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'చికెన్ లొల్లి'.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న వధువు vs వరుడు వర్గం !!

మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. అందుకే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ ఈ పెళ్లి వేడుక పెద్ద లొల్లి చేస్తే.. రెండు కుటుంబాలు కాస్తా ఒక్కటిగా మారాల్సిన వరుడు, వధువు కుటుంబ సభ్యులు.. ఇరు వర్గాలు ఒక్క కారణంతో పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. కానీ అందుకు గల కారణం తెలిసి అందరూ నవ్వుతున్నారు. అసలు ఏం జరిగింది.. చివరికి ఏమైందో మీకోసం ప్రత్యేకంగా..

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుక అనూహ్యంగా గందరగోళానికి తెరేలేపింది. ఓ గ్రామంలో జరిగిన ఈ పెళ్లిలో వధూవరుల కుటుంబాలు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. విందు సమయంలో మాంసాహార వంటకాలను వడ్డిస్తుండగా చికెన్ ఫ్రై వడ్డింపు విషయంలో.. మాటకుమాట అనుకుంటూ చివరికి పెద్ద గొడవగా మారింది. మొదటగా అతిథుల మధ్య "చికెన్ అయిపోయింది", "మాకు అందలేదు" అంటూ ప్రారంభమైన వాగ్వాదం క్రమంగా రెండు కుటుంబాల మధ్య వ్యక్తిగత విమర్శలకు దారి తీసిందని అంటున్నారు.

fight-over-chicken-fry-at-wedding-in-rajasthan-and-video-got-viral

సాక్షుల ప్రకారం..

వధూవరుల కుటుంబ సభ్యులు చికెన్ ఫ్రై సర్వింగ్‌ విషయంలో ఒకరినొకరు నిందించుకున్నారని వేడుకకు హాజరైన వారు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ వేశారు ? మాకు సర్వ్‌ చేయలేదు అనే కారణాలతో మొదలైన మాటలు.. ఆ తర్వాత పరిస్థితి నియంత్రణ తప్పి, ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని స్పష్టం చేశారు. గొడవలో కుర్చీలు, పాత్రలు విసురుకున్నారని గందరగోళంలో కొంతమంది మహిళలు, పిల్లలు కూడా గాయపడ్డారని తెలిపారు.

గొడవలో గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగిస్తోంది. కాగా సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, గొడవలో పాల్గొన్న వారిని విడదీశారు. ఇరువైపుల వారిని ప్రశాంతంగా మాట్లాడించి వివాదాన్ని పరిష్కరించారు. పెద్ద ఎత్తున గందరగోళం రాకుండా పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని సమాచారం.

వీడియో వైరల్..

ఇక ఈ మొత్తం సంఘటనను అక్కడున్న కొందరు అతిథులు మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో అవి వైరల్‌ గా మారాయి. వీడియోలో కొందరు అతిథులు కొట్టుకోవడం, మరికొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించడం స్పష్టంగా కనిపిస్తోంది. "చికెన్ ఫ్రై కోసం ఇంత గొడవ అవసరమా?" అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+