వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిజీతో ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఓవర్... (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీ తన పది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బుధవారం ఫిజీ దేశానికి చేరుకున్నారు. పర్యటనలో చివరిదైనా ఫిజీతో ప్రధాని మోడీ విదేశీ పర్యటన పూర్తి అవుతుంది. దీంతో ఈరోజు స్వదేశానికి తిరిగి రానున్నారు. తన మూడు దేశాల పర్యటలో చివరిదైన ఫిజీ దేశానికి ప్రధాని మోడీ భారీగా సాయం అందించారు. ఫిజీ నేషనల్‌ యూనివర్శిటీలో ఆయన హిందీలో ప్రసంగించారు. ఫిజీ జనాభాలో 37 శాతం మంది భారత సంతతికి చెందినవారే.

భారత్ కేవలం తన కోసం మనుగడ సాగించలేదని అన్నారు. భారత దేశ నిర్మాణం కేవలం దేశ వాసుల కోసమే కాదని, భారత్‌ ఈ ప్రపంచంపట్ల తన బాధ్యతను నెరవేర్చాలన్నదే మా దేశపు మునులు, మహాపురుషుల సందేశమని మోడీ పేర్కొన్నారు. ఆ బాధ్యతను నేరవేర్చేందుకు మా దేశం సంసిద్ధమవుతోందని ఆయన అన్నారు. ఫిజీలో విద్యుత్‌ ఫ్లాంట్‌ నిర్మాణానికి రూ. 430 కోట్ల భారీ సాయం ప్రకటించారు ప్రధాని మోడీ.

భారత్‌లో చదువుకునే ఫిజీ విద్యార్ధులకు డబుల్‌ స్కాలర్‌షిప్‌ సౌకర్యం కలగచేస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. విద్యార్థులు తమ దేశపు మౌలిక విలువలు కాపాడుకుంటూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. 21వ శతాబ్దంలో సాధారణ విద్య మాత్రమే సరిపోదని కొత్త కొత్త టెక్నాలజీని వాడుకోగల సామర్ధ్యాన్ని సొంత చేసుకోవాలని ఆయన అక్కడి విద్యార్ధులకు సూచించారు.

ఫిజీ దేశంలో వ్యవసాయం, పాడి పరిశ్రమల అభివృద్ధిలో భారత్‌ సహకరిస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. అంతక ముందు రాజధాని సువాలోని నౌశోరి అంతర్జాతీయ విమానాశ్రమంలో ఫిజీ ప్రధానమంత్రి దంపతులు.. భారత ప్రధాని మోడీకి ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని మోడీకి బస ఏర్పాటు చేసిన గ్రాండ్‌ ఫసిపిక్‌ హోటల్‌కు వెళ్లడానికి ముందు ఫిజీ సైన్యం మోదీకి గౌరవ వందనం సమర్పించారు.

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన


రాజధాని సువాలోని నౌశోరి అంతర్జాతీయ విమానాశ్రమంలో ఫిజీ ప్రధానమంత్రి దంపతులు మోదీకి స్వాగతం పలికారు.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

భారత ప్రధాని మోడీకి బస ఏర్పాటు చేసిన గ్రాండ్‌ ఫసిపిక్‌ హోటల్‌కు వెళ్లడానికి ముందు ఫిజీ సైన్యం మోదీకి గౌరవ వందనం సమర్పించింది.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

భారత ప్రధాని మోడీకి బస ఏర్పాటు చేసిన గ్రాండ్‌ ఫసిపిక్‌ హోటల్‌కు వెళ్లడానికి ముందు ఫిజీ సైన్యం మోదీకి గౌరవ వందనం సమర్పించింది.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

అనంతరం తమ సంప్రదాయం ప్రకారం దోనెలో ప్రత్యేక పానీయాన్ని భారత ప్రధాని మోడీకి అందజేశారు. తమ అతిథికి ఆయురారోగ్యాలు కలగాలని కోరుతూ గిరిజన దేవతలకు వారు ప్రార్థనలు చేశారు.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

సువాలోని ప్రసిద్ధ ఉద్యానవనం ఆల్‌బర్ట్‌ పార్క్‌లో మోదీకి ఫిజీ సంప్రదాయ తరహాలో స్వాగతం పలికారు. భారత ప్రధానిని చూడడానికి ఫిజీ చిన్నారులు ఆసక్తి చూపారు.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

మోడీ వారితో కొంత సమయం ఉల్లాసంగా గడిపారు. చిన్నారులతో ఫోటోలు తీసుకున్నారు.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

భారత ప్రధాని మోడీని తన సెల్ ‌ఫోన్‌లో బంధించడానికి ప్రయత్నిస్తున్నా ఓ ఫిజీ అమ్మాయి.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీ జనాభాలో 37 శాతం మంది భారత సంతతికి చెందినవారు కావడంతో ప్రధాని మోడీ వారందరితో ఉల్లాసంగా గడిపారు.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

భారత ప్రధాని మోడీని ఫోటో తీస్తుంటే ఆసక్తిగా గమనిస్తున్న మోడీ. చిన్నారులతో ఫోటోలు తీసుకున్నారు.

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీ జనాభాలో 37 శాతం మంది భారత సంతతికి చెందినవారు కావడంతో ప్రధాని మోడీ వారందరితో ఉల్లాసంగా గడిపి.. షేక్ హ్యాండ్ ఇచ్చారు.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీ ఆదివాసి సంప్రదాయాలను ప్రతిబింభించేలా గిరిజనులు చేసిన నాట్యాలు ఆకట్టుకున్నాయి. వారికి షేక్ హ్యాండ్ ఇస్తున్న ప్రధాని మోడీ.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

అనంతరం ఫిజీ పార్లమెంట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ ఫిజీ వాసులను ఉద్దేశించి ప్రసంగించారు.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

అల్‌బర్ట్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీతో ఓ చిన్నారి వారి మాటా మంతీ.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

అల్‌బర్ట్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ వద్ద నుండి ఆశీస్సులు తీసుకుంటున్న చిన్నారులు. మోడీని చూసేందుకు ఫిజీ ప్రజలు పార్క్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

అనంతరం ఫిజీ పార్లమెంట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వస్తున్న ప్రధాని మోడీ. ఫిజీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దేశపు పార్లమెంట్‌లో ప్రసంగించిన మొట్టమొదటి విదేశీ అతిథి మోడీయే కావడం విశేషం.

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీని డిజిటల్‌ దేశంగా మార్చడానికి భారత దేశం సహకరిస్తుందని చెప్పారు. ఫిజీలో విద్యుత్‌ ఫ్లాంట్‌ నిర్మాణానికి 7 కోట్ల డాలర్ల రుణం ప్రకటించారు.

 ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

అలాగే గ్రామాణ కుటీర పరిశ్రమల అభివృద్ధి, నవీకరణ కోసం 50 లక్షల డాలర్ల గ్రాంట్‌ కూడా మోదీ ప్రకటించారు. ఆ మేరకు ఇరు దేశాలకు చెందిన అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

భారత్‌లో చదువుకునే ఫిజీ విద్యార్ధులకు డబుల్‌ స్కాలర్‌షిప్‌ సౌకర్యం కలగచేస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. విద్యార్థులు తమ దేశపు మౌలిక విలువలు కాపాడుకుంటూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

ఫిజీలో ప్రధాని మోడీ పర్యటన

21వ శతాబ్దంలో సాధారణ విద్య మాత్రమే సరిపోదని కొత్త కొత్త టెక్నాలజీని వాడుకోగల సామర్ధ్యాన్ని సొంత చేసుకోవాలని ఆయన అక్కడి విద్యార్ధులకు సూచించారు. ఫిజీలో విద్యుత్‌ ఫ్లాంట్‌ నిర్మాణానికి భారత్‌ ప్రధాని నరేంద్రమోడీ రూ. 430 కోట్ల రుణం ప్రకటించారు.

English summary
Prime Minister Narendra Modi today said that Fiji could serve as a hub for stronger Indian engagement with the Pacific Islands and acknowledged that Indo-Fiji relations have "at times been adrift; and that our cooperation should be much stronger than it is".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X