ఎట్టకేలకు పీయూష్ గోయల్‌తో కేటీఆర్ బృందం భేటీ.. యాసంగి పంటపై ప్రధాన చర్చ
యాసంగి పంట కోనుగుల అంశంపై టీఆర్ఎస్- బీజేపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద స్పష్టత కోసం మంత్రుల బృందం ఢిల్లీలో మకాం వేసింది. అయితే కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ మాత్రం ప్రతినిధి బృందంతో తేలికగా సమావేశం కాలేదు. వాయిదాలు పెట్టి, అపాయింట్ మెంట్ ఇచ్చి.. వెయిట్ చేయించారు.
చివరికీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో బృందం కేంద్రమంత్రి గోయల్‌తో భేటీ అయ్యారు. సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, ఎంపీలు, కేంద్ర అధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశం పై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కోరింది. తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి పంటతో ఎంత ధాన్యం ? ఏ రూపంలో కొనుగోలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించింది.

అంతకుముందు పీయుష్ గోయల్ రెండు రోజుల నుంచి తెలంగాణ మంత్రులను ఎదురు చూయించారు. నిన్న రాత్రి 9 గంటలకు పీయూస్ గోయల్‌ను కలుద్దామనుకున్నారు. సమయం కుదరకపోవడంతో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రెండు గంటలుగా కూర్చొని... చివరికి మీట్ అయ్యారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత, రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. నిన్న కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శిని కలిసిన సీఎస్.. రాష్ట్ర పరిస్థితులు వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం సీఎం, మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో మకాం వేశారు.
Recommended Video
అంతకుముందు కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ నేతల గుట్టు మొత్తం బయటపడిందని విమర్శించారు. ఇకనైనా బీజేపీ నేతలు తమ చిల్లర పనులు మానుకోవాలని కేసీఆర్ అన్నారు. గుట్టు మొత్తం బయటపడిందని తెలిపారు. మీరేంటో అందరికీ అర్థం అయిందన్నారు. మీ కథేందో తెలిసిపోయింది జనాలకు. వాళ్లకు పూర్తిగా అర్థం అయిందన్నారు. తప్పుకు పొరపాటు అయింది.. క్షమించమని చెంపలేసుకొని ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలని సూచించారు. అనవసరమైన బేషజాలకు పోకుండా... వాస్తవాలు ప్రజలకు తెలపాలని సూచించారు. రైతులు కూడా బీజేపీ నేతల మాటలు పట్టుకొని ఆగం కావద్దని సూచించారు. రైతులను ఇకనైనా తప్పుదోవ పట్టించొద్దు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇలా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది.












Click it and Unblock the Notifications