'సీఎం'గా చిన్నమ్మ శశికళ.. జైలులో: సోషల్ మీడియాలో ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu
చెన్నై: అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ పైన సామాజిక అనుసంధాన వేదికలో సెటైర్లు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఆమె 'సీఎం' అయ్యారని అంటున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆమె గత రెండు నెలలుగా పావులు కదిపారు. వ్యూహాలు రచించారు. కానీ చివరకు జైలుకు వెళ్లారు. తన స్థానంలో తన విశ్వాసపాత్రుడు పళనిస్వామిని సీఎం చేశారు.


20 ఏళ్లకు.. గెలిచిందెవరు?: శశికళకు జైలు వెనుక.. ఆ 'ఒక్కడు'

అయితే, జైలులో శశికళకు కొవ్వొత్తుల తయారీని అధికారులు అప్పగించారు. ఇంగ్లీషులో క్యాండిల్స్ మేకర్ (candle maker-CM) అంటారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి. ఎట్టకేలకు ఆమె సీఎం అయ్యారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే జైలులో సీఎం అయ్యారని పేర్కొంటున్నారు.

అన్నాడీఎంకే హెచ్చరిక

అన్నాడీఎంకే హెచ్చరిక

శశికళకు వ్యతిరేకంగా మీమ్స్‌ను రూపొందిస్తున్న వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని అన్నాడీఎంకే ఐటీ విభాగం పేర్కొంది.

అన్నాడీఎంకే హెచ్చరిక

అన్నాడీఎంకే హెచ్చరిక

శశికళకు వ్యతిరేకంగా మీమ్స్‌ను రూపొందిస్తున్న వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని అన్నాడీఎంకే ఐటీ విభాగం పేర్కొంది.

అప్పటి నుంచి

అప్పటి నుంచి

శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పటి నుంచి పలురకాల మార్ఫింగ్‌ ఫొటోలు, పేరడి ఎస్సెమ్మెస్‌లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణానికి సిద్ధమైనప్పటి నుంచి ఇవి మరింత ఎక్కువయ్యాయి.

శశికళ శపథంపై..

శశికళ శపథంపై..

రెండు రోజుల క్రితం లొంగిపోయే ముందు జయలలిత సమాధి వద్ద చేసిన శపథం, కారాగారానికి వెళ్లడానికి సంబంధించి కూడా బుధ, గురువారాల్లో పెద్దఎత్తున మీమ్స్‌ వెలువడ్డాయి. వీటిపై అన్నాడీఎంకే ఐటీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

సున్నితమైన హెచ్చరిక

సున్నితమైన హెచ్చరిక

సామాజిక మాధ్యమాలపై దృష్టి సారించినట్లు అన్నాడీఎంకే ఐటీ విభాగం పేర్కొంది. పన్నీర్ సెల్వం మద్దతుదారులే ఇలా చేస్తున్నారని ఆరోపించింది. ఇప్పటి వరకు 180 మందిని గుర్తించామని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇకపై ఎవరూ తప్పుడు ప్రచారానికి పాల్పడకూడదని సూచించింది.

ఏడాదిలో మూడో ముఖ్యమంత్రి

ఏడాదిలో మూడో ముఖ్యమంత్రి

తమిళనాడులో ఏడాదిలోనే మూడో ముఖ్యమంత్రి వచ్చారు. గత ఏడాది ఎన్నికల్లో గెలిచిన తర్వాత జయలలిత సీఎం అయ్యారు. ఆమె మృతి అనంతరం పన్నీరు సెల్వం సీఎం అయ్యారు. ఇప్పుడు అన్నాడీఎంకేలో విభేదాలు, శశికళ జైలుకు వెళ్లడంతో.. పళనిస్వామి సీఎం అయ్యారు. దీంతో ఏడాదిలోనే తమిళనాడు మూడో సీఎంను చూసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Twitter never fails to entertain. There were a series of tweets mocking Sasikala Natarajan who is now in jail after being convicted in the disproportionate assets case. However the one that stood out was, "Finally she is CM, candle maker in prison."
Please Wait while comments are loading...