చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశానికి ఆర్దిక మంత్రి - కూరగాయల మార్కెట్ లో ఇలా : నెటిజెన్ల ట్రోలింగ్..!!

|
Google Oneindia TeluguNews

దేశానికి ఆర్దిక మంత్రి. దేశానికి సంబంధించిన ఆర్దిక వ్యవహారాలు మొత్తం ఆ మంత్రి చేతుల్లోనే. ధరల హెచ్చు తగ్గులు పైన ఆ మంత్రి నిర్ణయాలే కీలకం. అటువంటి కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్కసారిగా సాధారణ గృహిణి లాగానే కూరగాయల మార్కెట్ కు వెళ్లారు. చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలోని కూరగాయల మార్కెట్‌లో ప్రత్యక్షమయ్యారు. ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా రావటంతో మంత్రిని చూసిన వారు సడన్ గా షాక్ అయ్యారు.

మార్కెట్ లో సడన్ గా మంత్రి

నిర్మలా ఇతర మహిళలతో కలిసి కూరలను పరిశీలించారు. అక్కడ కూరగాయాల ధరలు అడిగి తెలుసుకున్నారు. చిలగడదుంపలు..కాకర కాయలు కొనుగోలు చేసారు. మంత్రికి తాము అమ్ముతున్న ధరలను చెప్పేందుకు వ్యాపారులు కొంత ఆలోచించారు. దీంతో..నిర్మల తోటి మహిళలతో కలిసి అక్కడ జరుగుతున్న అమ్మకాలను పరిశీలించారు. తనకు కావాల్సిన వాటి ధరల పైన ఆరా తీసారు. నిర్మలా సీతారమన్ కూరగాయలు కొనుగోలు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజెన్లు ఇదే సమయంలో ట్రోలింగ్ మొదలు పెట్టారు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

అన్నింటి పైనా జీఎస్టీ పేరుతో అధిక ధరలు వసూలు చేస్తూ బాదుతున్న కేంద్ర ఆర్దిక శాఖ..ఇప్పుడు కూరగాయల పైనా జీఎస్టీ విధిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొద్ది నెలల క్రితం కొన్ని ఆహార పదార్దాల పై జీఎస్టి విధించిటం..తరువాత నిర్ణయంలో మార్పులు చేయటం పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. దీంతో..ఇప్పుడు మంత్రి నేరుగా కూరగాయల మార్కెట్ కు రావటంతో..నెటిజెన్లు వెంటనే స్పందించారు. మంత్రి మార్కెట్ కు వచ్చారంటే కూరగాయల మీదా జీఎస్టీ తప్పదా అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. తమిళనాడు మంత్రి నిర్మలా సీతారామన్ సొంత రాష్ట్రం.

నెటిజెన్ల ట్రోలింగ్

నెటిజెన్ల ట్రోలింగ్

ఆంధ్రప్రదేశ్ కు కోడలు. ఆడిటర్ గా.. బీజేపీ అధికార ప్రతినిధిగా పని చేసిన నిర్మలా సీతారామన్ గతంలో రక్షణ శాఖ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు దేశ ఆర్దిక వ్యవస్థను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పర్యటనలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ పర్యటనలో రేషన్ దుకాణం పైన ప్రధాని ఫొటో లేకవపోటం పైన నిర్మల ప్రశ్నించటం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఆ సమయంలో విమర్శలు వినిపించాయి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన బీఆర్ఎస్ లక్ష్యంగా కేంద్ర మంత్రి విమర్శలు చేసారు. చెన్నై మార్కెట్ లో కనిపించిన మంత్రి..కూరగాయలు కొనుగోలు చేయటం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

English summary
Union Finance Minister Nirmala Sitaraman Suddenly enter in Vegetable market in Chennai, it goes viral in social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X