వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెదిరించి లైంగిక దాడి: బీజేపీ నేతపై ఎఫ్ఐఆర్

|
Google Oneindia TeluguNews

బదౌన్: చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతూ తన మీద బీజేపీ నాయకుడు కొన్ని సంవత్సరాల నుండి లైంగిక దాడి చేస్తున్నాడని ఓ మహిళ ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేసి విచారణ చేస్తున్నారు.

ఉత్తరప్రదశ్ లోని ఉమేష్ ఠాకూర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షల కారణంగా తన మీద ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారని అందులో ఎలాంటి వాస్తవం లేదని ఉమేష్ ఠాకూర్ కొట్టిపారేశారు. జిల్లా ఎస్పీ సుమిత్రా యాదవ్ కేసు వివరాలు వెల్లడించారు.

2009 పిబ్రవరి 14వ తేది నుండి తనను బెదిరించి లైంగిక దాడి చేస్తున్నాడని ఆమె పోలీసులకు చెప్పారు. తనకు లొంగకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించాడని ఆమె పోలీసులకు చెప్పారు. తనను తిరస్కరిస్తే ఏ మాత్రం సహించనని ఉమేష్ ఠాకూర్ అన్నాడని పోలీసులకు చెప్పారు.

 FIR against BJP leader in alleged sexual exploitation case in Uttar Pradesh

అదే విధంగా తాను ఎదురు తిరిగితే ఈ నెల 10వ తేదీన చంపేస్తానని బెదిరించాడని ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అంతే కాకుండ ఉమేష్ ఠాకూర్ బెదిరిస్తున్న వీడియో క్లిప్పింగ్ లను ఆమె పోలీసులకు అందించారు. పోలీసులు మహిళను వైద్య పరీక్షలకు తరలించారు.

గత అసెంబ్లీ ఎన్నికలలో పోటి చేసిన ఉమేష్ ఠాకూర్ 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పోటి చెయ్యడానికి ఇప్పటి నుండే సిద్దం అవుతున్నాడు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని, ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఉమేష్ ఠాకూర్ అంటున్నారు.

English summary
FIR has been registered against BJP leader Umesh Thakur for sexually exploiting a woman and making her clip, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X