డేంజర్ లో మోనాలిసా.. అందమే శాపమా..?.. ఐదుగురిపై FIR

మహా కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్ రోజుకో మలుపు తీసుకుంటోంది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోడానికి మహాకుంభమేళాకు వచ్చింది మోనాలిసా. అలా ఒక్క రాత్రిలోనే వైరల్ గర్ల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి.

అయితే బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. ఆమెతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రం పేరు ది డెయిరీ ఆఫ్ మణిపుర్. ప్రస్తుతం సనోజ్ మిశ్రా వద్దే మోనాలిసా యాక్టింగ్ పై శిక్షణ తీసుకుంటోంది. అయితే ఆయన మోనాలిసాతో చనువుగా వ్యవహరించడంపై పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సనోజ్ మిశ్రా.. మోనాలిసాను ట్రాప్ చేస్తున్నారని.. డబ్బుకోసం ఆమెను వాడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

FIR Filed Against Monalisa and Sanoj Mishra Over Alleged Indecent Comments

ఐదుగురిపై FIR నమోదు..

ఈ వ్యాఖ్యలు చేసిన వారిలో జితేంద్ర నారాయణ సింగ్ తో పాటు మరో ఐదుగురిపై ముంబైలోని అంబోలీ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు వ్యాఖ్యలతో తన గౌరవాన్ని దిగజారుస్తున్నారని, మోనాలిసాను రోడ్డుకు ఈడుస్తున్నారని పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్ లో సనోజ్ మిశ్రా పేర్కొన్నారు. ఈ ఘటనపై అంబోలీ స్టేషన్ పోలీసులు ఐదుగురిపై FIR నమోదు చేశారు. పోలీసులు FIR నమోదు చేసిన వారిలో వాసిమ్ రజ్వీ, రవి సుధా చౌదరీ, మహీ ఆనంద్, మారుత్ సింగ్, అభిషేక్ ఉపాధ్యాయా ఉన్నారు.

FIR Filed Against Monalisa and Sanoj Mishra Over Alleged Indecent Comments

ఈ ఐదుగురు తనపై అకారణంగా వ్యాఖ్యలు చేస్తున్నారని FIRలో పేర్కొన్నారు సనోజ్ మిశ్రా. మోనాలిసాతో తాను చేస్తున్న సినిమాను ఆపేందుకు యత్నిస్తున్నారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+