వ్యాపారిపై హత్యాయత్నం, ప్రముఖ నటిపై ఎఫ్ఐఆర్, డబ్బులు, గతంలో బ్లాక్ మెయిల్ !

మైసూరు/బెంగళూరు: అప్పుగా తీపుకున్న నగదు తిరిగి ఇవ్వమని చెప్పినందుకు రౌడీలు, యువకులతో తన మీద ప్రముఖ కన్నడ నటి ద్రిశ్య హత్యాయత్నం చేయించిందని వ్యాపార వేత్త కర్ణాటకలోని కేఆర్ఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నడ నటి అనుచరులు హత్యాయత్నం చెయ్యడంతో భాదితుడు కేఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

ఆయోగ్య చిత్రంలో హీరోయిన్‌గా

ఆయోగ్య చిత్రంలో హీరోయిన్‌గా

ఇటీవల విడుదలైన కన్నడ ఆయోగ్య సినిమాలో ద్రిశ్య హీరోయిన్ గా నటించింది. తన దగ్గర ద్రిశ్య నగదు అప్పుగా తీసుకుందని వ్యాపార వేత్త రాజేష్ ఆరోపిస్తున్నాడు. తన దగ్గర తీసుకున్న నగదు తిరిగి చెల్లించాలని తాను నటి ద్రిశ్యకు చెప్పానని, ఆ సమయంలో ఆమె దురుసుగా ప్రవర్తించిందని వ్యాపార వేత్త రాజేష్ ఆరోపించారు.

 అప్పు తీసుకొని రుణం..

అప్పు తీసుకొని రుణం..

అప్పుగా తీసుకున్న రుణం చెల్లించమని చెప్పడంతో నీ అంతు చూస్తానని, తన అనుచరులు, అభిమానులు నీ కు తగిన బుధ్ది చెబుతారని నటి ద్రిశ్య వార్నింగ్ ఇచ్చిందని రాజేష్ ఆరోపించాడు. శుక్రవారం రాత్రి తన మీద నటి ద్రిశ్య అనుచరులు, రౌడీలు కత్తులు, ఆయుధాలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని వ్యాపార వేత్త రాజేష్ కేఆర్ఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 రౌడీలు దాడి చేయడంతో

రౌడీలు దాడి చేయడంతో

అప్పుగా తీసుకున్న నగదు చెల్లించాలని నటి ద్రిశ్యను అడుగుతావా, నీకు ఎంత ధైర్యం, నీ ప్రాణాలు తీస్తామని రౌడీలు దాడి చేసి బెదిరించారని రాజేష్ ఫిర్యాదు చేశాడని పోలీసులు అన్నారు. నటి ద్రిశ్య, ఆమె తండ్రి మీద కేసు నమోదు చేశామని కేఆర్ఎస్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేశామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

 ఆస్పత్రిలో చికిత్స

ఆస్పత్రిలో చికిత్స

దాడికి గురైన రాజేష్ కేఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు. గతంలో నటి ద్రిశ్య మీద అనేక అరోపణలు ఉన్నాయి. నగదు కోసం తమను నటి ద్రిశ్య బ్లాక్ మెయిల్ చేసిందని కొందరు ఆరోపణలు చేసి పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు ఏకంగా నటి ద్రిశ్య మీద హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+