మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే, సినీ నిర్మాతకు సినిమా చూపించిన మాజీ గురువు !
బెంగళూరు/దేవనహళ్లి: కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు సినిమా చూపించాలని కాంగ్రెస్ పార్టీ బావిస్తోందని తెలిసింది. ఇప్పుడు బీజేపీ నాయకులు మీద సిద్దరామయ్య ప్రభుత్వం నిఘా వేసింది.
ప్రభుత్వ భూమిలో అక్రమంగా రాళ్లు తవ్వుతున్నారని, అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ తో బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్నారని, అనుమతి లేకుండా జిలెటిన్ స్టిక్స్ వినియోగిస్తున్నారనే ఆరోపణలపై కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై బెంగళూరు నగర శివార్లలోని చిక్కజాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

హుణసమారనహళ్లి, సొన్నప్పన గ్రామాల్లో అక్రమ క్వారి తవ్వకాలపై యలహంక తాలూకా తహసీల్దార్ అనిల్ అరోలికర్ ఫిర్యాదు చేయగా మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నతో పాటు ఆనందన్, వి. గణేష్, రాధమ్మలపై బెంగళూరు గ్రామీణ జిల్లాలోని చిక్కజాల పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించి తరువాత ఆపరేషన్ కమలలో భాగంగా బీజేపీలో చేరి మంత్రి అయిన మునిరత్నకు ఇప్పుడు ఇబ్బందులు ఎదరైనాయి.
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దేవనహళ్లి- కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డులోని హుణసమరనహళ్లి గ్రామంలోని సర్వే నెం.179లో ప్రభుత్వ డీకేటీ బండ ప్రాంతం ఉంది. ఈ భూమి పక్కనే ఉన్న సొన్నప్పనహళ్లి గ్రామంలోని సర్వే నెం.177/3, 178/1-2-3, 179, సర్వే నెం.34/1-2-3, సర్వే నెం.17/7-8-9లో అక్రమంగా క్వారి, రాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు.
అలాగే జై భీమ్ సేన కార్యకర్తలు జిలెటిన్ స్టిక్స్ తో రాళ్లను పేల్చేందుకు ఉపయోగిస్తున్నారని ప్రాంతీయ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని డిప్యూటీ డివిజనల్ అధికారి, తహసీల్దార్‌లను ప్రాంతీయ కమిషనర్ ఆదేశించారు. ఇప్పుడు ఈ వివాదం పెద్దది కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఆరోపిస్తున్నారు.
దీనిపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ కన్నడ సినీ నిర్మాత మునిరత్న మాట్లాడుతూ ఇది ప్రభుత్వ స్థలం కాదు. 25 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన తమ స్థలంలో భవనం నిర్మించేందుకు పునాది కోసం రాళ్లు తొలగిస్తున్నామని, మా భూమిలో మేము భవనం నిర్మించడం తప్పా? పునాది తవ్వుతుండగా రాళ్లు వచ్చాయని, తొలగించేందుకు ఓ ఏజెన్సీకి పని అప్పగించామని బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నా అంటున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications