వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం .. అరుణ్ జైట్లీ సేఫ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే భారీ అగ్నిప్రమాదం జరిగింది. 34 ఫైరింజన్లు రంగంలోకి మంటలను ఆర్పివేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కూడా మంటలు అదుపులోకి రాలేదని విశ్వసనీయంగా తెలిసింది. అగ్నిప్రమాదం ఒకటి , రెండు నుంచి మూడు, నాలుగో ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఆందోళన నెలకొంది.

 fire accident at aiims .. arun jaitly safe

మరో భవనం
ఎయిమ్స్‌లో అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదం విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కార్డియో న్యూరో సెంటర్ ఐసీయూలో జైట్లీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇది అగ్నిప్రమాదం జరిగిన చోట కాకుండా మరో భవనమని అధికారులు పేర్కొన్నారు. దీంతో బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అగ్నిప్రమాదం దృష్ట్యా ఎమర్జెన్సీ బ్లాకును మూసివేశారు.

సోషల్ మీడియాలో వీడియో
అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణం తెలియరాలేదు. దీంతో ఎయిమ్స్ ఎమర్జెన్సీ బ్లాకును మూసివేశారు. ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదానికి సంబంధించి ఓ వీడియోను వైద్యుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిప్రమాదానికి సంబంధించి సాయంత్రం 5 గంటలకు తమకు సమాచారం అందిందని అగ్నిమాపక సిబ్బంది మీడియాకు తెలిపారు. వెంటనే ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఎయిమ్స్‌లోనే మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కార్డియో న్యూరో సెంటర్ ఐసీయూలో జైట్లీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

English summary
Former finance minister Arun Jaitley is admitted at the Intensive Care Unit (ICU) of the cardio-neuro centre. This unit is however housed in a different building in the complex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X