బెంగళూరు శివార్లలో బూడిద అయిన కెమికల్ ఫ్యాక్టరీ, శివరాత్రి పండగ దెబ్బతో!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కెమికల్ ఫ్యాక్టరీలో ఆకస్మికంగా మంటలు వ్యాపించి బూడిద అయిన ఘటన బెంగళూరు నగర శివార్లలో జరిగింది. బెంగళూరు నగర శివార్లలోని నెలమంగల తాలుకా డాబస్ పేట్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కెమికల్ ఫ్యాక్టరీ పూర్తిగా కాలి బూడిద అయ్యింది.

కెమికల్ ఫ్యాక్టరీ

కెమికల్ ఫ్యాక్టరీ

నెలమంగళ తాలుకాలోని డాబస్ పేట ఇండస్ట్రియల్ ఏరియాలో లియోనిడ్ కెమికల్ పీవీ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. మంగళవారం శివరాత్రి పండగ సందర్బంగా కెమికల్ ఫ్యాక్టరీ కంపెనీ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.

వేకువ జామున

వేకువ జామున

బుధవారం వేకవ జామున లియోనిడ్ కెమికల్ పీవీ లిమిటెడ్ కంపెనీలో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. విషయం గుర్తించిన కంపెనీ సెక్యూరిటీ గార్డు, పక్క కంపెనీ ఉద్యోగులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందకి సమాచారం అందించారు.

పక్క కంపెనీలు

పక్క కంపెనీలు

లియోనిడ్ కెమికల్ పీవీ లిమిటెడ్ కంపెనీలో భారీగా కెమికల్స్ బ్యారెల్స్ నిల్వ చెయ్యడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది అనేక వాహనాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని పక్క కంపెనీలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుని మంటలు అదుపు చేశారు.

రూ. లక్షల్లో నష్టం

రూ. లక్షల్లో నష్టం

అగ్ని ప్రమాదం వలన లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని లియోనిడ్ కెమికల్ పీవీ లిమిటెడ్ కంపెనీ నిర్వహకులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Fire accident in chemical factory near Bengaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి