మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం...ఆరుగురు కార్మికులు మృతి...
మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమవ్వగా, మరికొందరికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటన పాల్ఘర్ జిల్లాలోని తారాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కెమికల్ ఫ్యాక్టరీలో చోటుచేసుకుంది.
కెమికల్ యూనిట్‌లో ఈ ఘోర అగ్ని ప్రమాదం శుక్రవారం చోటుచేసుకుంది. ఇందులో ఆరుగురు ఉద్యోగులు మృతిచెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీవ్ర మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రమాదం ఎలా సంబవించిందో అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.

ఉన్నట్టుండి కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో కంపెనీ యాజమాన్యం వెంటనే ఫైర్ స్టేషన్ సమాచారం అందించింది. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతిచెందిన వారిలో రాజ్ మౌర్య (45), నిషికాంత్ చౌదరి (36), పవన్ డెస్లే (32), సంతోష్ హింద్లేకర్ (49), ఆదేశ్ చౌదరి (25), చందన్‌లుగా అధికారులు గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు కెమికల్ ఫ్యాక్టరీ సిబ్బంది మంటలను ఆర్పివేశారని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడిసి) అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications