వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు సాంకేతిక లోపం కాదట .. మరి ఏం జరిగింది ?

|
Google Oneindia TeluguNews

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దర్భంగా న్యూ ఢిల్లీ బీహార్ సంపత్ క్రాంతి సూపర్ ఫాస్ట్ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దర్భంగా నుండి న్యూఢిల్లీ వెళ్తుండగా ఎస్-6 బోగీకి బుధవారం రాత్రి 8 గంటలకు మంటలు అంటుకున్నాయి. వాటిని గుర్తించిన ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వారు అప్రమత్తమై బోగీని వేరుచేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

సాధారణ నిర్వహణ పనుల కోసం రైలు రేక్ పాయింట్ వద్ద ఉన్నప్పుడు రైలు ఎసి కోచ్ లో మంటలు చెలరేగాయి. రాత్రి 10.55 గంటల సమయంలో రైలులోని ఎసి కోచ్ ఎస్ -6 లో మంటలు మొదలయ్యాయి. ఎవరికి ప్రాణహాని జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి కారణాలపై రైల్వే ఉన్నత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

 Fire at Sampark Kranti Express is not a technical flaw... What happened?

మొదట రైలు బోగీలో షార్ట్ సర్క్యూట్ జరిగిందేమో అని భావించిన అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేశారు . రైలు బోగీలో ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగలేదని గుర్తించారు. ఇంకా ఎవరైనా ఆకతాయిలు కావాలనే రైలు లో మంట పెట్టారా లేదా మరేమైనా అసాంఘిక శక్తులు ఈ ప్రమాద ఘటన కు కారణమా అనే కోణంలో రైల్వే పోలీసులు, అధికారులు విచారణ జరుపుతున్నారు. సకాలంలో స్పందించడం వల్ల ప్రాణహాని చెప్పినప్పటికీ మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో బోగి పూర్తిగా దగ్ధమైపోయింది. బోగీని వేరు చేసి అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. మొత్తానికి రైల్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు విచారణ చేస్తున్నారు.

English summary
A coach of Bihar Sampark Kranti Superfast Express, which plies on the New Delhi to Darbhanga route, caught fire late Wednesday. The AC coach of the train caught fire when the train was at the rake point for routine maintenance work in the yard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X