జడ్జి ఇంట్లో నోట్ల గుట్టలు! ఎలా బయట పడ్డాయంటే?
Delhi High Court Judge: ఓ న్యాయమూర్తి నివాసంలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడటం సంచలనంగా మారింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో మార్చి 14వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీ మొత్తంలో డబ్బు కనిపించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలిజీయం స్పందించింది.
జడ్జి జశ్వంత్ వర్మను మరో హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే, ఈ ఘటన న్యాయవ్యవస్థలో ఈ ఘటన సంచలనంగా మారింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ జశ్వంత్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబసభ్యులే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. అయితే, అక్కడ భారీ ఎత్తున నోట్ల కట్టలు ( సుమారు రూ. 15కోట్లు) దర్శనమిచ్చాయి.

ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో.. ఆ మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు. అదంతా లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు. వెంటనే ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా సీజేఐ సంజీవ్ ఖన్నాకు చేరింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీజేఐ.. వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ వర్మను అలహాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయించారు.
గతంలో వర్మ అక్కడే పనిచేసి 2021లో ఢిల్లీకి రావడం గమనార్హం. కాగా, ఐదుగురు సభ్యులన్న కొలీజియం కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. జస్టిస్ వర్మను కేవలం బదిలీతోనే న్యాయశాఖ ప్రతిష్ఠ తిరిగిరాదని అభిప్రాయపడ్డారు. అందుకే వర్మను రాజీనామా చేయాలని కోరడమో.. ఆయనపై సీజేఐ అంతర్గత విచారణ చేపట్టడమూ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా, ఇలాంటి ఘటనే 2008, ఆగస్టు 13న చోటు చేసుకుంది. పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ జిత్ కౌర్ ఇంటి ఎదుట రూ. 15 లక్షల నోట్లు ఉన్న బాక్స్‌ను కొందరు ఉంచారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేశారు. ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగించారు.
దర్యాప్తు అనంతరం 2011 మార్చిలో ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జి గా ఉన్న జస్టిస్ నిర్మల్ యాదవ్ పై అభియోగాలు నమోదు చేశారు. ఆమె 2009 వరకు పంజాబ్-హర్యానా కోర్టులో పనిచేశారు. ఓ కేసు తీర్పు నిమిత్తం నిర్మల్ యాదవ్ కు ఇవ్వాల్సిన డబ్బును పొరపాటున జస్టిస్ నిర్మల్ జిత్ కౌర్ ఇంటి వద్ద పెట్టినట్లు దర్యాప్తులో తేలడం గమనార్హం. తాజాగా, ఢిల్లీ జస్టిస్ వ్యవహారం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications