ఢిల్లీ గిడ్డంగిలో అగ్నిప్రమాదం, భారీగా ఎగిసిపడుతోన్న మంటలు, ఘటనాస్థలికి 14 ఫైరింజన్లు
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బిజ్వాసన్‌లోని గిడ్డంగి నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. శుక్రవారం తెల్లవారుజామున మంటలను స్థానికులు గుర్తించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి 14 ఫైరింజన్లు చేరుకొన్నాయి. మంటలను ఆర్పివేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాయి.

ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. గిడ్డంగిలో ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications